Pages - Menu

Pages

Monday, April 3, 2023

Hrudayamanedu Thalupu Song Lyrics || Andhra Kraisthava Keerthanalu || Christian Old Songs Lyrics


హృదయమనెడు తలుపు నొద్ద – యేసు నాథుండు

నిలచి – సదయుడగుచు దట్టుచుండు – సకల విధములను (2) ||హృదయ||



1. పరుని బోలి నిలుచున్నాడు – పరికించి చూడ

నతడు – పరుడు గాడు రక్షకుండు – ప్రాణ స్నేహితుడు (2)

||హృదయ||



2. కరుణా శీలుండతడు గాన – గాచి యున్నాడు
యేసు – కరుణ నెరిగి గారవింప – గరము న్యాయంబు (2)

||హృదయ||



3. ఎంత సేపు నిలువ బెట్టి – యేడ్పింతు రతని
నాత – డెంతో దయచే బిలుచుచున్నా – డిప్పుడు మిమ్ములను (2)

||హృదయ||



4. అతడు మిత్రుడతడు మిత్రుం – డఖిల పాపులకు
మీర – లతని పిలుపు వింటి రేని – యతడు ప్రియుడగును (2)

||హృదయ||



5. జాలి చేత దన హస్తముల – జాపి యున్నాడు
మిమ్ము – నాలింగనము సేయ గోరి – యనిశము కనిపెట్టు (2)

||హృదయ||



6. సాటిలేని దయగల వాడు – సర్వేశు సుతుడు
తన – మాట వినెడు వారల నెల్ల – సూటిగ రక్షించు (2)

||హృదయ||



7. చేర్చుకొనుడి మీ హృదయమున – శ్రీ యేసునాథు
నతడు – చేర్చుకొనుచు మీ కిచ్చును – చీర జీవము కృపను (2)

||హృదయ||



8. అతడు తప్పక కలుగజేయు – నఖిల భాగ్యములు
మీర – లతని హత్తుకొందు రప్పు – డానందము తోడ (2)

||హృదయ||



9. బ్రతుకు శాశ్వతంబు కాదు – పరికించు చూడు
గాన – బ్రతికి యుండు కాలముననే – ప్రభుని గొలువండి (2)

||హృదయ||




No comments:

Post a Comment

Suggest your Song in the Comment.