పూర్ణ హృదయముతో
పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో
నా పూర్ణ మనస్సుతో నిన్ను ప్రేమింతును
మంచి దేవుడవు ఎంతో మంచి ప్రభుడవు
నా మంచి ప్రియుడవు యేసు నిను ప్రేమింతును
1. నేనంటు లేనపుడే యేసు
నను నీవు యెరిగితివని తెలుసు
నిను నేను కోరక మునుపే
నను కోరి భువిపై జన్మించి
నా పాపము దూరము చేయుటకు
నా బలము చాలదు ఆని యెరిగి
నీ మదిలో నా పేరు తలచి
ఆనాడే నాకై మరణించి
రక్షణనిచ్చితివి - ఉచితముగా కృపమూలముగా
నీ మేలును ఏల మరతును యేసు నిన్ను ప్రేమింతును
2. నాపై నీకంత ప్రేమ
ఎందుకనో తెలిపెదవా దేవా
ఒక రోత హృదయుని కోసం
అన్ని ఘోర శ్రమలను పొందితివా
లోకము ఎరుగని వింత ప్రేమ
సిలువలో నిను చూడగా కనిపించే
నీ దేహముపైన గాయములు
ఆ ప్రేమ లోతును కనపరిచే
నా పాపమంతటిని - కడిగితివా నీ రక్తముతో
నన్నంతగా ప్రేమించితివి - నేను నిన్ను ప్రేమింతును
No comments:
Post a Comment
Suggest your Song in the Comment.