నిశిరాత్రి
నిశిరాత్రి సుడిగాలిలో చిక్కితిని
ఊపిరితో మిగిలెదనా ఉదయానికి
తడవు చేయక యేసు నను చేరుకో
నా ప్రక్కనే ఉండి నను పట్టుకో
భయముండగలదా నీవున్నచో
నీ కన్నులు నామీద నిలిచుండగా
నా చేయి నీ చేతిలో ఉండగా
1. ఈ చీకటి సమయం నిలిచెను నా ఈ పయనం
కనిపించక దారులు మొదలాయెను కలవరము
వీచే ఈ గాలులలో నే కొట్టుకుపోకుండా
తప్పించెదవని దేవా ఆశతో నే వేచితిని
నీవు గాక నాకిపుడు దిక్కెవ్వరు
అల్పము ఈ జీవితమని నేనెరిగితిని
2. నే చేసిన వాగ్ధానము లెన్నో ఉన్నాయి
నెరవేర్చు బాధ్యతలు ఇంకా మిగిలాయి
ఈ రేయి ఈ చోటే నేనాగి పోవలదు
రాతిరి గడిచేవరకు నీ చాటున నను దాచి
ఉదయమును చూపించుము నా కంటికి
3. కనురెప్పపాటున ఆవిరికాగలదు
అనుదినమిక నీ కృపనే నే కోరుచు
పయనింతును నా గురివైపు నిను ఆనుకుని
భయముండగలదా నీవున్నచో
నీ కన్నులు నామీద నిలిచుండగా
నా చేయి నీ చేతిలో ఉండగా
No comments:
Post a Comment
Suggest your Song in the Comment.