Pages - Menu

Pages

Saturday, June 17, 2023

Yehova maa thandri gada Song Lyrics || Old christian Songs Lyrics || Andhra Kraisthava Keerthanalu

యెహోవా మా తండ్రి 

Singer : J. Wilson Herald

Lyrics : Purushottam choudhary

Music : V.K.Henry 


యెహోవా మా తండ్రి గాఁడ యేసుఁడు 

మా యన్న గాఁడ మహిమ గల శుద్ధాత్మ 

యిట్టి వరుసఁ దెలిపెం గద మాతోడ ||యెహోవా||



1. మోక్ష నగరు మా పుట్టిల్లు ముఖ్య దూతల్ 

మా స్నేహితులు సాక్షాత్కారమై యున్నపుడు

 లక్ష్యపెట్ట మిహ బాధలకు ||యెహోవా||



2. అబ్రాహాము దావీదు మొదలై నట్టి 

వర భక్తాగ్రేసరులే శుభ్రముగ మా చుట్టా 

లైనన్ హర్షమిఁక మా కేమి కొదువ ||యెహోవా||



3. పేతు రాది సకలాపోస్తుల్ పేర్మిగల 

మా నిజ వర కూటస్థుల్ ఖ్యాతి సభలో 

మే మున్నప్పుడు ఘనతలిక మాకేమి వెలితి ||యెహోవా||



4. తనువు బలిపెట్టెను మా యన్న 

తప్పు ల్విడఁ గొట్టెను మా తండ్రి మనసులో సాక్ష్యమిట్లున్న 

మనుజు లెట్లన్నను మా కేమి ||యెహోవా||



5.పరమ విభు జీవగ్రంథములోఁ బ్రభుని 

రక్తాక్షరముద్రితమె చిరముగా నుండు మా
 
పేరు చెఱుపు బెట్టెడువా రింకెవరు ||యెహోవా||



6. కరములతో నంట రాని కన్నులకు 

గోచరము గాని పరమ ఫలముల్ మా కున్నపుడు

 సరకు గొన మిక్కడి లేములకు ||యెహోవా||

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.