Pages - Menu

Pages

Saturday, June 17, 2023

Yerigi Yunnanaya Song Lyrics || Latest Christian Songs Lyrics || Chinnysavarapu Songs

ఎరిగియున్నానయా


ఎరిగియున్నానయా నీకేదీ అసాధ్యము కాదని

తెలుసుకున్నానయా నీవెపుడూ మేలు చేస్తావని మార్పులేని దేవుడ నీవని -

మాట ఇచ్చి నెరవేర్చుతావని||2||
మారని వాగ్దానములు మాకొరకు దాచి ఉంచినావని

1. నను చుట్టుముట్టిన బాధలతో

నాహృదయం కలవరపడగా
నా స్వంత జనుల నిందలతో

నా గుండె నాలో నీరైపోగా ||2||
అక్కున నన్ను చేర్చుకుంటివే - భయపడకంటివే
మిక్కుట ప్రేమను చూపితివే నను ఓదార్చితివే ||2||

|| ఎరిగియున్నానయా ||


2. మించిన బలవంతుల చేతి నుండి

తప్పించిన యేసు దేవుడా
వంచనకారుల వలల నుండి

రక్షించిన హృదయనాధుడా ||2||
నిరాశలో నన్ను దర్శించితివే - ఆదరించితివే
సజీవునిగా నన్నుంచితివే - కృపను పంచితివే||2||

|| ఎరిగియున్నానయా ||

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.