Pages - Menu

Pages

Wednesday, August 23, 2023

Dhevathi Deva Song Lyrics | Samy Pachigalla | Enosh Kumar | Enoch Jagan | Latest Telugu Christian Songs 2023

దేవాతి దేవా


1. రేయి పగలు నీ పాద సేవ జీవదాయక చేయుట మేలు
సాటిలేని దేవుడా నీవే నాదు కోట కొండయు నీవే (2)
పరమపురిలో దేవా నిరతం
దూత గణముల స్తుతులను సల్పి (2)
శుద్ధుడూ పరిశుద్ధూడనుచూ పూజనొందే దేవుడా నీవే (2)


2. రేయి పగలు నీ పాద సేవే యేసయ్యా ..........
సాటి లేరయా సాటి లేరాయా
దేవాది దేవా రాజాది రాజా (2)
చీకటి నుండి వెలుగునకు మరణము నుండిజీవముకు(2)
మము పిలచిన దేవా స్తోత్రము
మము నడిపిన దేవా స్తోత్రము
ఇశ్రాయేలు జనములను దాస్యము నుండి విడిపించి (2)
పాలు తేనెలు ప్రవహించు కానాను దేశము నడిపించిన(2)


3. దేవాది దేవా రాజాది రాజా
బ్రతుకుట క్రీస్తే చావైన మేలే (2)
క్రీస్తుకు హతసాక్షిగా మారినా (2)
పౌలు వలే సాగేదా
నే సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా (2)
యేసుతో గడిపెద యేసుతో నడిచేద (2)
పరమును చేరగా నే వెళ్లేదా (2)
హానోకు వలే సాగెదా


4. శ్రమలలో బహు శ్రమాలలో ఆదరణ కలిగించేను
వాక్యమే కృపావాక్యమే నను వీడని అనుబంధమై (2)
నీ మాటలే జలధారలై సంతృప్తి నిచ్చేను
నీ వాక్యమే ఔషదమై గాయములు కట్టెను
కరుణించే యేసయ్యా ...... యేసయ్యా ........
నీ కోసమే నా జీవితం
నిను చేరే ఆశయం తీరాలయ్యా
నిను చూసే ఆక్షణం రావాలయ్య.......రావాలయ్యా
సాటి లేరయా సాటి లేరయా
దేవాది దేవా రాజాది రాజా (2)

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.