Halaman

Pages - Menu

Pages

Sunday, November 19, 2023

VELASENULE GAGANANA SONG LYRICS|| LATEST TELUGU CHRISTMAS SONG 2023 || Sharon Sisters || JK Christopher || Bro.T. Sunil

వెలసెనులే గగనాన


వెలసెనులే గగనాన తూర్పుతార - నిశీధిరేయి జాములో

కురిసెనులే జగాన ప్రేమధార - రక్షకుడేసు జన్మలో

క్రిస్మస్ కాంతులే లోకాన వెలిగెనే - ప్రభుయేసే జన్మించగా

కన్యకు పుట్టేనేడు పరిశుద్ధుడే - దీనులు ధన్యులాయెనే

"శుభవార్త దూతదెల్పగ - ఆ గొల్లలే గంతులేసేనే

లోకాన రక్షణానందమే - పరలోకానా సంగీతమాయెనే "



1. తరించిపోయే ఆ తూర్పు జ్ఞానులు - తీరాలు దాటి నిను చూడగా వెలసెనులే గగనాన

బంగారు సాంబ్రాణి బోళములర్పించి - నమస్కరించి పూజించిరి

రారాజే రక్షకుడై మనకోసం జన్మించెనని



2. జగాలనేలే జయశీలుడేసే - జీవాధిపతిగా జనియించెనే

శరీరధారై పరిశుద్ధుడేసే - పశుశాలలోన పవళించెనే

జయగీతం పాడి - కీర్తించి కొనియాడెదము



3. మా పాపభారం భరియించెనే - మా దుఃఖ్ఖ దోషం తొలగించెనే

మన్నించి మమ్ము క్షమియించెనే - కరుణించి మాపై కృపచూపునే

మనసున్న మహారాజై - మా మదిలో ఉదయించెనే

ఇది నవోదయం II Idi Navodhayam Song Lyrics || Katru Yohanu || Sireesha Bhagavatula || KY Ratnam || Latest Telugu christmas Song 2023

ఇది నవోదయం





ఆలాపన: మహా... శుభదినం దివితేజుడు - భువికేతించిన దినం
ఓఓ..ఓఓ..ఓఓ....ఓఓ..ఓఓ..ఓఓ



పల్లవి: ఇది నవోదయం దివితేజుడు - భువికేతించిన దినం
మహిమాన్వితుడు - మహికేతించిన మహా శుభదినం.....||2||


పాడెదమ్ పాడెదమ్ - రారాజు పుట్టాడని

చాటెదమ్ చాటెదమ్ - రక్షకుడు వెలిసాడని.....||2||
ఆహా హ్యాపి క్రిస్మస్ - ఓహో మెర్రి క్రిస్మస్
ఆహా హ్యాపి క్రిస్మస్ - ఓహో..హో మెర్రి క్రిస్మస్



1.చ: కన్య మరియ గర్భమందు - కారణజన్ముడై అవతరించే
పాపాన్ని రూపుమాప - నరరూపం ధరియించే.....||2||
మానవాళ్ళిని రక్షించే - పరవాసులన్ చేయవచ్చే.....(పాడెదమ్ )



2.చ: గగనాన్న పుట్టింది ఓ తార - చూపింది జ్ఞానులకు దారి
శిశువును గాంచి సంతసించి - సాగిలపడి పూజించిరి.....||2||
బంగారు సాంబ్రాణి బోళము - సమర్పించి తరియించిరి .....(పాడెదమ్)



3.చ: దూత తెల్పె దావీదు పురమందు - రక్షకుడు పుట్టాడని
పరలోక సైన్యం పరవశించి - పాడిస్తుతించె ప్రభువుని.....||2||
శాంతి సమాధానం రక్షణనివ్వ - వేంచేసెనని....( పాడెదమ్ )


Album: ఇది నవోదయం II Idi Navodhayam
Lyrics : Bro. Yohanu Katru
Produced by : Katru Sreshta
Tune & Music : KY Ratnam
Singer : Sireesha Bhagavatula

సంతోషకరమగు వర్తమానము || Latest telugu christmas song 2023 || #2023teluguchristiansongs

సంతోషకరమగు వర్తమానము || Latest telugu christmas song 2023 || #2023teluguchristiansongs




ప:-ప్రజలందరికిని కలుగబోవు సంతోషకరమగు వర్తమానము - పరలోకమునుండి ప్రభువు చేత పంపబడిన వర్తమానము "2"
రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు-పాపాన్ని బాపే విమోచకుడు "2"
ఆయనే యేసుక్రీస్తు "4"


హ్యాపీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్-మెర్రి క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ "2"



1.యేసు అనగా రక్షకుడు - క్రీస్తు అనగా అభిషిక్తుడు "2" అభిషిక్తుడైన రక్షకుడు అవనిపై అడుగు పెట్టాడు "2" ఆనందం ఇల పంచాడు హ్యాపీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్-మెర్రి క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ "2"


2.మనుష్య రూపునిగ వచ్చాడు - మహిమలెన్నో చేసాడు "2" మహిమాన్వితుడైన ఆ ఘనుడు ప్రాణ త్యాగం చేసాడు "2" పరముకు దారి చూపాడు హ్యాపీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్-మెర్రి క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ "2"


రచన..స్వరకల్పన...
రాజు రిచర్డ్స్



CREDITS: Keyboard's: Samarpan Raja Rhythm's: Kishore Emmanuel Guitar's: Richardson Mix&Mastering: Sam K Srinivas Lyric's&Tune: Raju Richard's Vocal's: M M Srilekha



#johnweslyministries,johnweslysongs,blessieweslysongs,teluguchristiansongs,glorioussong,paulemmanuel,nissypaulsongs,oneness

AKAASA VEEDHULLO ANANDAM (Sambaralu 6) | #JoshuaShaik| Pranam Kamlakhar | Telugu Christmas Song 2023 #JoshuaShaikSongs #PranamKamlakhar #JavedAli #Anwesshaa #JesusSongsTelugu #TeluguChristmasSongs #TeluguChristianSongs





ఆకాశ వీధుల్లో ఆనందం - ఆ నింగి తారల్లో ఉల్లాసం
ఈ రేయి వెన్నెల్లో సంతోషం - ఇల పొంగేను లోలోన సంగీతం
లోకాలకే రారాజుగా - యేసయ్య పుట్టాడుగా .. హేహెయ్


లోకాలనేలే నాధుడు వెలిసాడు నా మెస్సయ్య దరిచేరినాడు దీనుడై ధరలోన నా యేసయ్య ఇలలో జాడగా పలికిందిగా వింతైన ఓ తారక మదిలో నిండుగా ఓ పండుగ తెచ్చాడు నా రక్షక సదా దీపమై సంతోషమై పరమాత్ముడే ఈనాడే జన్మించె


1. గొల్లలంతా గంతులేసి సందడే చేసిరీ దూతలంతా సంతసించి స్తుతులనే పాడిరీ చీకటంటి బ్రతుకులోన చెలిమిగా చేరెనే వెన్నెలంటి మమత చూపి కరుణతో కోరెనే సదా స్నేహమై నా సొంతమై పరమాత్ముడే ఈనాడే జన్మించె


అహా సంతోషమే మహదానందమే ఇల వచ్చింది ఓ సంబరం సమాధానమే ఇల నీ కోసమే దిగివచ్చిందిగా ఈ దినం


2. వాక్యమైన దేవుడేగా బాలుడై వచ్చెను పాపమంతా తీసివేయ రక్షణే తెచ్చెను వేడుకైన ఈ దినాన యేసునే వేడుకో అంతులేని చింతలేని పరమునే పొందుకో సదా తోడుగా నీ అండగా పరమాత్ముడే ఈనాడే జన్మించె



CREDITS: LYRICS & PRODUCER : Joshua Shaik MUSIC : Pranam Kamlakhar VOCALS : Javed Ali , Anwesshaa