Pages - Menu

Pages

Sunday, November 19, 2023

VELASENULE GAGANANA SONG LYRICS|| LATEST TELUGU CHRISTMAS SONG 2023 || Sharon Sisters || JK Christopher || Bro.T. Sunil

వెలసెనులే గగనాన


వెలసెనులే గగనాన తూర్పుతార - నిశీధిరేయి జాములో

కురిసెనులే జగాన ప్రేమధార - రక్షకుడేసు జన్మలో

క్రిస్మస్ కాంతులే లోకాన వెలిగెనే - ప్రభుయేసే జన్మించగా

కన్యకు పుట్టేనేడు పరిశుద్ధుడే - దీనులు ధన్యులాయెనే

"శుభవార్త దూతదెల్పగ - ఆ గొల్లలే గంతులేసేనే

లోకాన రక్షణానందమే - పరలోకానా సంగీతమాయెనే "



1. తరించిపోయే ఆ తూర్పు జ్ఞానులు - తీరాలు దాటి నిను చూడగా వెలసెనులే గగనాన

బంగారు సాంబ్రాణి బోళములర్పించి - నమస్కరించి పూజించిరి

రారాజే రక్షకుడై మనకోసం జన్మించెనని



2. జగాలనేలే జయశీలుడేసే - జీవాధిపతిగా జనియించెనే

శరీరధారై పరిశుద్ధుడేసే - పశుశాలలోన పవళించెనే

జయగీతం పాడి - కీర్తించి కొనియాడెదము



3. మా పాపభారం భరియించెనే - మా దుఃఖ్ఖ దోషం తొలగించెనే

మన్నించి మమ్ము క్షమియించెనే - కరుణించి మాపై కృపచూపునే

మనసున్న మహారాజై - మా మదిలో ఉదయించెనే

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.