పల్లవి:-నా తోడుగ నీవు- నీనీడలో నేను
కలకాలం ఉండాలనీ
నీతోనే నేను రానా - నీతోనేనుండిపోనా (2)
యేసయ్యా యేసయ్యా -
స్తుతి ఘన మహిమలతో - నిన్నే ఆరాధించెదను (2)
1. పునరుత్థానుడా నా యేసు ప్రభువా
చూపించితివి - నీజీవమార్గము (2)
సాగిపోయెదను - నీవాక్యపు వెలుగులోనే (2)
యేసయ్యా యేసయ్యా
స్తుతి ఘన మహిమలతో - నిన్నే ఆరాధించెదను (2)
2. నాలో నివసించి సంచరించి
అంతరంగమును - పరిశుద్ధపరచి (2)
నూతన పునాది వేసితివి -
నీ ఆలయముగ మార్చితివి (2)
యేసయ్యా యేసయ్యా
స్తుతిఘన మహిమలతో-
నిన్నే ఆరాధించెను (2)
3. ముందెన్నడులేని - ఆనందముతో
ఉప్పొంగుచున్నది - నాహృదయమెంతో (2)
నీవిక నేమాత్రము -
కన్నీళ్లు విడువవంటివే (2)
యేసయ్యా యేసయ్యా -
స్తుతిఘన మహిమలతో -
నిన్నే ఆరాధించెను (2)
No comments:
Post a Comment
Suggest your Song in the Comment.