సదయుడా నా యేసయ్యా
సదయుడా నా యేసయ్యా
స్తుతి ఘనతా మహిమ నీకేనయ్య
ప్రతి క్షణము నీ వాత్సల్యమును చూపి విడువక
ప్రేమించితివే - ఎడబాయక కాచితివే
నీవే స్తుతి గానము - నీవే నా విజయము నీవే నా అతిశయం యేసయ్యా
1.నా సరిహద్దులలో నెమ్మది కలుగగా కారణము నీవే
కృపా క్షేమము నావెంట నిలువగ కనికరము నీదే
సన్నుతించెదనూ ఊపిరున్నంత వరకూ
విశ్రమించను నేను నిన్ను చేరేంత వరకూ
నిన్ను చేరేంత వరకూ...
2.పలు విధములుగా నిను విసిగించినా
నను సహియించితివే
పూర్ణ ఓరిమితో నను భరియించి భుజమున మోసితివే
సన్నుతించెదనూ ఊపిరున్నంత వరకూ
విశ్రమించను నేనూ నిన్ను చేరేంత వరకూ
నిన్ను చేరేంత వరకూ...
No comments:
Post a Comment
Suggest your Song in the Comment.