Pages - Menu

Pages

Thursday, January 11, 2024

పైకి ఎగిరెదవు | Paiki Egiredhavu Song Lyrics | Devuni anandam song lyrics| The Promise 2024 | Telugu Christian Song | Jesus Calls

పైకి ఎగిరెదవు

దేవుని ఆనందం నిను కమ్మును

ఉన్నతమైన స్థలములు నిను ఆహ్వానించున్- 2

పరలోక స్వాస్థ్యముతో పోషించును నిన్ను

ఆకాశపు వాకిళ్లు తెరుచును నీకు -2

నీవు పైకి లేచెదవు పై పైన ఎగిరెదవు

నీవు వేచియున్న దినముల యొక్క ఫలమును పొందెదవు -2

కోల్పోయినవన్ని రెండింతలుగా మరలా పొందెదవు -2

1. బాధించు బంధకములు ఈ దినమే విప్పబడున్

నీ ముందు అడ్డుగా నిలిచే సంకెళ్లు తెగిపడున్ -2

నీకున్న దర్శనం నెరవేర త్వరపడున్

అనుకూల ద్వారములు నీ కొరకు తెరవబడున్ - 2

నీవు పైకి లేచెదవు పై పైన ఎగిరెదవు

నీవు వేచియున్న దినముల యొక్క ఫలమును పొందెదవు -2

కోల్పోయినవన్ని రెండింతలుగా మరలా పొందెదవు -2

2. నీతి సూర్యుడు నీ పైన ఉదయించును

యేసుని రెక్కల క్రింద ఆరోగ్యమొందెదవు -2

నీ కాలి క్రింద దుష్టుడు ధూళిగా మారును నింగిలో మెరుపు వలె శత్రువు కూలును - 2

నీవు పైకి లేచెదవు పై పైన ఎగిరెదవు

నీవు వేచియున్న దినముల యొక్క ఫలమును పొందెదవు -2

కోల్పోయినవన్ని రెండింతలుగా మరలా పొందెదవు -2

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.