Pages - Menu

Pages

Sunday, January 28, 2024

NEEVE NEEVE SONG LYRICS | #JoshuaShaik Song Lyrics | Pranam Kamlakhar Song Lyrics | Sawai Bhatt| Haricharan| 2024 Telugu Christian Songs


నీవే నీవే


నీవే నీవే నీవే మా ప్రాణం

యేసు నీవే నీవే మా గానం

ఆశ్రయమైన ఆధారమైన నీ దివ్య ప్రేమ చాలయ్య

కొలుతుము నిన్నే యేసయ్య



1. శాశ్వతమైన నీ తొలి ప్రేమ - మార్గము చూపీ కాచే ప్రేమ

ఆదియు నీవే అంతము నీవే - నీ చరణములే శరణమయ

నిను పోలి ఇలలోన - ఒకరైన కనరారే

నివు లేని బ్రతుకంతా - యుగమైనా క్షయమేగా

విలువైన వరమేగా - నివు చూపే అనురాగం

కలకాలం విరబూసే - ప్రియమార స్నేహమే

నీ ప్రియ స్నేహం - ఆనందం

కొలుతుము నిన్నే ఆద్యంతం ||నీవే నీవే||



2. ఊహకు మించిన నీ ఘన కార్యం - ఉన్నతమైన నీ బహుమానం

నీ కృపలోనే చూచిన దేవా - జీవనదాత యేసయ్య

కలనైనా అలలైనా - వెనువెంటే నిలిచావు

కరువైనా కొరతైనా - కడదాకా నడిచావు

ఇహమందు పరమందు - కొలువైన ప్రభు యేసు

ఎనలేని దయ చూపే - బలమైన నామమే

నీ ఘన నామం - మా ధ్యానం

కొలుతుము నిన్నే ఆద్యంతం ||నీవే నీవే||

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.