Pages - Menu

Pages

Wednesday, February 21, 2024

Viluvainadhi Yesayya Nee Krupa Song Lyrics| Sumanth Prasad | Pastor John J (Raja Nee Sannidhilone)|Latest christian telugu songs 2024


పల్లవి :

విలువైనది దేవా నీ ప్రేమ క్షణమైనా నన్ను మరువనిది
నా ప్రతి అడుగును స్థిరపరిచి తొట్రిల్లనీయక కాపాడినది
కృంగియున్న వేళలో ఆదరించిన కృప
జారియున్న స్థితిలో చేరదీసిన కృప
వెలకట్టలేనిది శ్రేష్ఠమైన నీ కృప

అ. పల్లవి :

ఆరాధనా నా యేసుకే నా గానము నీ కోసమే
ఆరాధనా నా యేసుకే నా జీవితం నీ సేవకే


చరణం 1:

నీపై యున్న ప్రేమను వర్ణింప గోరగా
నాలో మార్పు తెచ్చిన సిలువ ప్రేమ కనబడెను
ఆ ప్రేమను మించిన ప్రేమ లేదు ఇలలోన
ఎలా బ్రతుకగలనయ్యా నీ తోడు లేకుండా ? ॥అ.ప॥


చరణం 2:

నీతో కలసి నేను పయనింప గోరగా
నా చేయి పట్టి నడిపించుచున్నావు
నీ జతే ఉండగా భయము లేదు ఇలలోన
ఎలా నిలువగలనయ్యా నీ తోడు లేకుండా? ॥అ.ప॥

చరణం 3:

నీతో కలిసి నేను నివసింప గోరగా
నాకై నీవు స్థలమును సిద్ధపరచుచున్నావు
నీ రాకకై నేను వేచియుంటి ఇలలోన
నిను చేరు వరకు నిరీక్షణతో వేచెదా... ॥అ.ప॥

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.