Halaman

Pages - Menu

Pages

Friday, March 8, 2024

Akasamu vaipu na kannulethuchunnanu Song Lyrics॥ Hosanna Ministries 2024 New Album Song-6 || Pas.FREDDY PAUL


ఆకాశము వైపు నా 

కన్నులెత్తుచున్నాను 

 ఆకాశము వైపు నా కన్నులెత్తుచున్నాను 

                   నా సహాయకుడవు నీవే యేసయ్యా....           ॥2॥ 

కలవరము నొందను నినునమ్మి యున్నాను 

కలత నేను చెందను కన్నీళ్లు విడువను


1. ఆకాశముపై నీ సింహాసనమున్నది 

రాజదండముతో నన్నేలుచున్నది 

నీతిమంతునిగా చేసి నిత్యజీవమనుగ్రహించితివి 

నేనేమైయున్నానో అది నీ కృపయే కదా ..... 


|| ఆకాశము వైపు॥


2. ఆకాశము నుండి నాతో మాట్లాడుచున్నావు 

ఆలోచన చేత నన్ను నడిపించుచున్నావు 

నీ మహిమతో నను నింపి నీ దరికి నన్ను చేర్చి (చేర్చితివి) 

నీవుండగ ఈ లోకములో ఏదియు నాకక్కరలేనే లేదయ్యా....


 || ఆకాశము వైపు || 


3. ఆకాశము నుండి అగ్ని దిగివచ్చియున్నది 

అక్షయ జ్వాలగ నాలో రగులుచున్నది 

నా హృదయము నీ మందిరమై తేజస్సుతో నింపి (నింపితివి) 

కృపాసనముగా నను మార్చి నాలో నిరంతరము నివసించితివి....


   ॥ ఆకాశము వైపు ॥


4. ఆకాశము నీ మహిమను వివరించుచున్నది 

అంతరిక్షము నీ చేతి పనిని ప్రచురించుచున్నది 

భాషలేని మాటలేని స్వరమే వినబడనివి 

పగలు బోధించుచున్నదీ రాత్రి జ్ఞానమిచ్చుచున్నది....


 ॥ ఆకాశము వైపు॥


5. క్రొత్త ఆకాశం క్రొత్త భూమి నూతన యెరూషలేము నాకై నిర్మించుచున్నావు 

మేఘ రథములపై అరుదెంచి నను కొనిపోవా.... 

ఆశతో వేచియుంటినీ త్వరగా దిగిరమ్మయ్య ....


    ॥ ఆకాశము వైపు ॥



HOSANNA MINISTRIES SONG 2024 BOOK

Thursday, March 7, 2024

Siluvalo Vrelaade Hosanna Songs Lyrics ॥ Hosanna Ministries 2024 New Album Song-2 Bro.YESANNA garu

సిలువలో వ్రేలాడే 




సిలువలో వ్రేలాడే నీ కొరకే - యేసు నిన్ను 

పిలచుచుండే - ఆలస్యము నీవు చేయకుము



1. కల్వరి శ్రమలన్ని నీ కొరకే - ఘోర సిలువ మోసే కృంగుచునే 

గాయములాచే బాధనొంది - రక్తము కార్చి హింసనొంది

॥సిలువ॥



2. నాలుక యెండెను దప్పిగొని - కేకలు వేసెను దాహమని 

చేదు రసమును పానము చేసి - చేసెను జీవయాగమును

॥సిలువ॥



3. అగాధ సముద్ర జలములైనా - ఈ ప్రేమను ఆర్పజాలవుగా 

ఈ ప్రేమ నీకై విలపించుచూ - ప్రాణము ధార బోయుచునే

    ॥సిలువ॥



👇👇👇

SUBSCRIBE MY CHANNEL !!!



Sraavyasadhanamu Song Lyrics ॥ Hosanna Ministries 2024 New Album Song-5 || Hosanna Ministries Song Lyrics

నీవే శ్రావ్య సదనము




నీవే శ్రావ్య సదనము - నీదే శాంతి వదనము 

నీ దివిసంపద నన్నే చేరగా 

నా ప్రతి ప్రార్థన నీవే తీర్చగా ॥ 2॥ 

నా ప్రతి స్పందనే ఈ ఆరాధన 

నా హృదయార్పణ నీకే యేసయ్య ॥2॥



1. విరజిమ్మే నాపై కృపకిరణం -

 విరబూసె పరిమళమై కృపకమలం॥ 2॥ 

విశ్వాసయాత్రలో ఒంటరినై - 

విజయశిఖరము చేరుటకు ॥2॥ 

నీదక్షిణ హస్తం చాపితివి నన్నాదుకొనుటకు వచ్చితివి ॥ 2 ॥ 

నను బలపరచి - నడిపించే నా యేసయ్యా

                             ||నీవే||



2. నీనీతి నీరాజ్యం వెదకితిని 

నిండైన సౌభాగ్యం పొందుటకు 

నలిగివిరిగిన హృదయముతో- 

నీ వాక్యమును సన్మానించితిని ॥2॥ 

శ్రేయస్కరమైన దీవెనతో - 

శ్రేష్ఠఫలములను ఇచ్చుటకు ॥ 2 ॥ 

నను ప్రేమించి - పిలచితివి - నా యేసయ్యా

                              ||నీవే||



3. పరిశుద్ధాత్మకు నిలయముగా 

ఉపదేశమునకు వినయముగా ॥2॥ 

మహిమ సింహాసనము చేరుటకు 

వధువు సంఘముగా మార్చుమయ్య ॥2॥ 

నా పితరులకు ఆశ్రయమై 

కోరినరేవుకు చేర్పించి ॥ 2 ॥ 

నీ వాగ్ధానం -నెరవేర్చితివి - నా యేసయ్యా

                              ||నీవే||


Neeke Gana Sthuthimalika Song Lyrics॥ Hosanna Ministries 2024 New Album Song-4|| Hosanna Ministries Song Lyrics || Pas.RAMESH Songs

 నీకేగానా స్తుతిమాలిక




 నీకే 
గానా స్తుతిమాలిక - నీకొరకే ఈ ఘనవేదిక 

నీప్రేమనాపై చల్లారిపోదు - మరణానికైనా వెనుదిరుగలేదు 

మనలేనునే నినుచూడక మహాఘనుడా నాయేసయ్యా!



1. సంతోషగానాల స్తోత్రసంపద - నీకే చెల్లింతును ఎల్లవేళలా 

అనురాగశీలుడా - అనుగ్రహపూర్ణుడా  

నీ గుణశీలత వర్ణింపతరమా  ||2||

నాప్రేమ ప్రపంచమునీవేనయ్యా 

నీవులేని లోకాన నేనుండలేనయ్యా 

నా ప్రాణం - నా ధ్యానం - నీవేనయ్యా
                           
    || నీకేగా||



2. నీతో సమమైన బలమైన వారెవ్వరు? 

లేరే జగమందు నే ఎందువెదకినను 

నీతి భాస్కరుడా - నీ నీతికిరణం- ఈ లోకమంతా ఏలుచున్నదిగా 

నా మదిలోన మహారాజు నీవేనయా 

ఇహపరమందు నన్నేలు తేజోమయా 

నీ నామం - కీర్తించి - ఆరాధింతును..
     
      || నీకేగా ||



3. నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు 

వేరే ఆశేమియు లేదు నాకిలలో 

నా ప్రాణప్రియుడా నన్నేలు దైవమా 

ఆపాదమస్తకం నీకేగా అంకితం 

నా శ్వాస నిశ్వాసయు నీవేనయ్య - నా జీవిత ఆధ్యంతం నీవేనయ్య 

నీ కొరకే - నేనిలలో - జీవింతును

       || నీకేగా||


Parimala thailam Neeve Song Lyrics || HOSANNA MINISTRIES 2024 Song Lyrics || Pastor John Wesly Songs

పరిమళతైలం నీవే





పరిమళతైలం నీవే - తరగని సంతోషం నీలో 

జీవనమకరందం నీవే - తియ్యని సంగీతం నీవే 

తరతరములలో నీవే - నిత్యసంకల్పసారధి నీవే 

జగములనేలే రాజా - నాప్రేమకు హేతువు నీవే



1. ఉరుముతున్న మెరుపులవంటి 

తరుముచున్న శోధనలో॥ 2॥ 

నేనున్నా నీతో అంటూ నీవే నాతో నిలిచినావు 

క్షణమైనా విడువక ఔదార్యమును నాపై చూపినావు 

నీమనస్సే అతిమధురం అది నాసొంతమే

                               ॥ పరిమళ॥



2. చీల్చబడిన బండనుండి నా - 

కొదువ తీర్చి నడిపితివి 

నిలువరమగు ఆత్మశక్తితో - కొరతలేని ఫలములతో 

నను నీ రాజ్యమునకు పాత్రునిచేయ 

ఏర్పరుచుకొంటివి 

నీ స్వాస్థ్యములో నే చేరుటకై - అభిషేకించినావు 

నీ మహిమార్థం వాడబడే నీ పాత్ర నేను

                             ॥ పరిమళ॥ 



3. వేచియున్న కనులకు నీవు కనువిందే చేస్తావని 

సిద్ధపడిన రాజుగ నీవు నాకోసం వస్తావని 

నిను చూచిన వేళ నాలో ప్రాణం ఉద్వేగభరితమై 

నీ కౌగిట ఒదిగి ఆనందముతో నీలో మమేకమై 

యుగయుగములలో నీతో నేను నిలిచి పోదును

                                     ॥ పరిమళ॥






Karunasagara song lyrics ॥ Hosanna Ministries 2024 New Album Song-3 || Hosanna Ministries Song Lyrics || Pas.ABRAHAM Song Lyrics

కారుణాసాగర



కారుణాసాగర యేసయ్యా 

కనుపాపగ నను కాచితివి 

ఉన్నతమైన ప్రేమతో  

మనసున మహిమగా నిలిచితివి ||2||
                        
                                 ||కారుణాసాగర యేసయ్యా||



1. మరణపులోయలో - దిగులు చెందగా 

అభయము నొందితి - నిను చూచి   ||2||

దాహముతీర్చిన జీవనది 

జీవమార్గము - చూపితివి     ||2||
                          
                                        ||కారుణాసాగర యేసయ్యా||



2. యోగ్యత లేని - పాత్రను నేను 

శాశ్వత ప్రేమతో - నింపితివి    ||2||

ఒదిగితిని - నీ కౌగిలిలో 

ఓదార్చితివి - వాక్యముతో   ||2||

                                        ||కారుణాసాగర యేసయ్యా||



3. అక్షయస్వాస్థ్యము - నే పొందుటకు 

సర్వసత్యములో - నడీపీతివి  ||2||

సంపూర్ణపరచి -జ్యేష్టులతో

ప్రేమనగరిలో - చేర్చుమయ్యా  || 2||

                                        ||కారుణాసాగర యేసయ్యా|| 

👇👇👇

SUBSCRIBE MY CHANNEL


Nuthanamaina Krupa Song Lyrics ॥ Hosanna Ministries 2024 New Album Song-1|| Hosanna Ministries Song Lyrics|| Pas.JOHN WESLEY Songs

నూతనమైన కృప 



నూతనమైన కృప నవ నూతనమైన కృప 

శాశ్వతమైన కృప బహు ఉన్నతమైన కృప 

నిరంతరం నాపై చూపిన - 

నిత్య తెజూడా యేసయ్య 

నీ వాత్సల్యమే నాపై చూపించిన   - 

నీ ప్రేమను వివరించనా 

నను నీ కోసమే ఇలా బ్రతికించిన  - 

జీవాధిపతి నీవయ్య 

ఇదే కదా నీలో పరవశం  - 

మరువలేని తియ్యని జ్ఞాపకం 

||నూతనమైన||



1. నా క్రయధనముకై - రుధిరము కార్చితివి 

                 ఫలవంతములై - తోటగా మార్చితివి  ||2||

ఫలితముకొరకైన - శోధన కలిగినను 

ప్రతిఫలముగ నాకు - ఘనతను నియమించి 

ఆశ్చర్యకరమైన అదరణ -  కలిగించి 

అన్నివేలలయందు   - ఆశ్రయమైనావు   

ఎంతగా కీర్తించినా  - నీ ఋణమే నే తీర్చగలనా 

ఇదే కదా నీలో పరవశం  - 

మరువలేని తియ్యని జ్ఞాపకం 
  
||నూతనమైన||



2. నీ వశమైయున్న - ప్రాణాత్మదేహమును
 
               పరిశుద్ధపరచుటయే - నీకిష్టమాయెను |2||

పలు వేదనలలో - నీతో నడిపించి 

తలవంచని తెగువ - నీలో కలిగించి  

మదిలో నిలిచావు - మమతను పంచావు 

నా జీవితమంతా - నిను కొనియాడెదను 

ఎంతగా కీర్తించిన - నీ ఋణమే నే తీర్చగలనా   

ఇదే కదా నీలో పరవశం  - 

మరువలేని తియ్యని జ్ఞాపకం 
  
||నూతనమైన||



3. సాక్షి సమూహము -మేఘమువలెనుండి 

       నాలో కోరిన - ఆశలు నెరవేరగా      ||2||

వేలాది  దూతల - ఆనందము చూచి 

కృప మహిమైశ్వర్యం - నే పొందిన వేళ 

మహిమలో - నీతోనే నిలిచిన వేళ 

మాధుర్య లోకాన - నిను చూచిన వేల 

ఎంతగా కీర్తించిన - నీ ఋణమే నే తీర్చగలనా   

ఇదే కదా నీలో పరవశం  - 

మరువలేని తియ్యని జ్ఞాపకం 
  
||నూతనమైన||



👇👇👇

SUBSCRIBE MY CHANNEL


Monday, March 4, 2024

Yesayya aaa yessaya Song Lyrics| Ninnu polinavarevvaru endedhu vethikina Song Lyrics | Latest Song - Vagdevi | Hosanna Ministries

యెసయ్యా
నిన్నుపోలిన ఎవ్వరు


యెసయ్యా....అ
యెసయ్యా...అఅ
యెసయ్యా..అఆ
యెసయ్యా..ఆఅఅ
నిన్నుపోలిన ఎవ్వరు

ఎదెందుందు వెతకినలేరు ధరణిలో
యెసయ్యా..అ యెసయ్యా...ఆఅ
యెసయ్యా...ఆఅ
యెసయ్యా....ఆఆ
నిన్నుపోలినవారెవ్వరు
ఎందెందు వెదకినలేరే ధరణిలో
యెసయ్యా.... యెసయ్యా....అ
యెసయ్యా..ఆఅ యెసయ్యా..ఆఅఅ


1.కనాను వివాహములో
కొరతలెన్నొఉండగ
నీటిని ద్రాక్షరసముగ
మార్చినావు నీవయ్యా ||2||
నిన్నుపోలినవారెవ్వరు
ఎందెందు వెదకినలెరె ధరణిలో
యెసయ్యా...అ యెసయ్యా.,..అ యెసయ్యా....ఆఅ
యెసయ్యా....ఆఅఅ


2.ఐదు రొట్టెలు
రెండు చేపలను
ఆశీర్వదించి‌
ఐదువేలమందికి
సమృద్ధిగ
పంచినవయ్యా ||2||
నిన్నుపోలినవారెవ్వరు
ఎందెందుందు
వెదకినలేరె ధరణిలో
యెసయ్యా..... యెసయ్యా....అ యెసయ్యా...అఅ
యెసయ్యా....అఆఅ


3. సముద్రములో
తుఫాను గాలి
అలజడినేరేపగా
గద్దించి వాటిని
నిమ్మలము చేసినవయ్యా...||2||
నిన్నుపోలినవారెవ్వరు
ఎందెందు
వెదకినలేరే ధరణిలో
యెసయ్యా.... యెసయ్యా....అ యెసయ్యా....

అఅ యెసయ్యా...ఆఅఅ


4.చనిపోయిన లాజరును
పేరుపెట్టి పిలిచీ
మరణమును నిరర్థకముచేసి
ఆశ్చర్యము కలిగించినావయ్యా ||2||
నిన్ను పోలిన వారెవ్వరు ఎందెందు
వెతికినాలేరే ధరణిలో
యేసయ్యా... యేసయ్యా...అ
యేసయ్యా...అఅ
యేసయ్యా...అఅఅ


5.కనులుండి చూడలేని
చెవులుండి వినలేని
కాళ్ళుండి నడవలేని
వారికి మనోనేత్రము
వెలిగించినావయ్యా ||2||
నిన్ను పోలిన‌ వారెవ్వరు
ఎందెందు
వెతికినలేరే ధరణిలో
యేసయ్యా...
యేసయ్యా...అ యేసయ్యా....అఅ
యేసయ్యా....అఅఅ


6.సర్వలోక పాపము కొరకై
సిలువలో మరణించి
మృత్యుంజయుడవై
నీవు తిరిగిలేచి నావయ్య ||2||
నిన్ను పోలిన వారెవ్వరు
ఎందెందు వెతికినలేరే ధరణిలో
యేసయ్యా....
యేసయ్యా...అ
యేసయ్యా....అఅ

Deham cheelutunna Song Lyrics | GOOD FRIDAY SONG 2024 Songs| Timothy Vemulapalli | Nissy John Songs

దేహం చీలుతున్నా


దేహం చీలుతున్నా..
దాహం వేస్తున్నా...
దారంతరక్థమైన....
ఆగలేదు ఎందుకు..
గాయం బాధిస్తున్నా
గమ్యం నేనంటు
గుండె నిండా నా పైనా ఇంత ప్రేమ ఎందుకు
కరుణ చూపే నీకు కఠోర శ్రమ ఇప్పుడు
కలిగింది నా వాలనే కాదనలేను
రమ్యమైన నీ మోముపై రవ్వంత జాలి లేక
పిడి గుద్దులు గుద్దిన పాపిని నేను కనబడుతున్నది నీ త్యాగం
ప్రాణం పోతున్నా ఆపని ఆ బలియాగం ....... || 2||



1. ఎంతో ఆశగా చేసుకున్నావు నన్ను
అంతే అలుసుగా తీసివేసినాను నిన్ను దేవా......
నీ కంటి పాపలా చూసుకున్నావు నన్ను
నీ కన్నీటికి కారణము నేను అందని ఆకాశమందు అందాల రాజువు
అక్కరకే రాను కదా అవనికి దిగి వచ్చితివా..... || 2|| యేసయ్యా........ కనబడుతున్నది నీ త్యాగం
ప్రాణం పోతున్నా ఆపని ఆ బలి యాగం ..... || 2 ||

2. ఎన్నో మారులు క్షమియించినావు నన్ను
మారని నా బ్రతుకు సిలువ వేసింది నిన్ను దేవా.......
ఎంతో ఓర్పుతో సహియించినావు నన్ను
ఈ లోక ఆశలతో నే మరచితి నిన్ను
నరకపు కూపములో నే వేదన పడలేనని
దేవా నీవే నరుడై బలియాగమైతివా యేసయ్యా...... వినబడుతున్నది నీ ప్రేమ నినాదం
విడువను ఏడబాయనన్న చిరకాల వాగ్దానం ..... ||2||