Pages - Menu

Pages

Sunday, March 3, 2024

NANU DEEVINCHAVU SONG LYRICS | నను దీవించావు | SRESHTA KARMOJI SONGS | SUHAS KARMOJI SONGS| LATEST TELUGU CHRISTIAN SONGS LYRICS




ఎన్నెనో మేలులతో నను దీవించావు
నా జీవితకాలమంత యెరిగి ఉన్నావు
ఏమిచ్చి నీ ఋణము నే తీర్చగలను
ఎన్ని రీతులుగా కీర్తించగలను వందనాలు యేసయ్య నీకే
శతకోటి స్తోత్రలయ్యా నీకే || 2 ||

|| ఎన్నెనో మేలులతో ||

ష్టాల మార్గములో అలసిన పయణములో
నిందలు మోయలేక కృంగిన సమయములో || 2 ||
సంపూర్ణముగా నాకు పరిశుద్దతనిచ్చావు
సమాధాన కర్తవు నీవై నన్ను ఆదరించావు || 2 ||

|| వందనాలు ||


ఏ గమ్యము ఎరుగని నా జీవిత యాత్రలో
అలజడి అలలెన్నో చెలరేగెను నా మదిలో || 2 ||
కలవరమును కరిగించి, కరుణను కురిపించావు
నా భయమును గద్దించి, నీ శాంతితో నింపావు || 2 ||

|| వందనాలు ||

కలిగేటి శోధనలు, కనపడని మార్గములు
నీ వాక్యమే దీపముగా, సాగెను నా పాదములు || 2 ||
అపవాదిని నా చేత, ఓడింప జేసావు
వాగ్దాన పూర్ణుడిగా జయ జీవిత మిచ్చావు || 2 ||

|| వందనాలు ||

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.