Halaman

Pages - Menu

Pages

Tuesday, December 31, 2024

Hosanna Ministries 2025 New Year Song || Yessaiah Na Paranam Song Lyrics || Yessaya Na Pranama Song Lyrics 2025


పల్లవి :- యేసయ్య నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా -2 
అద్భుతమైన నీ ఆదరణే - ఆశ్రయమైన నీ సంరక్షణయే నను నీడగ వెంటాడెను - నే అలయక నడిపించెను నా జీవమా - నా స్తోత్రమా - నీకే ఆరాధన నా స్నేహము - సంక్షేమము - నీవే ఆరాద్యుడా

1 : చిరకాలము నాతో ఉంటానని - క్షణమైనా వీడిపోలేదని నీలో ననుచేర్చుకున్నావని - తండ్రితో ఏకమై ఉన్నామని ఆనందగానము నే పాడనా -2

ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగున్న అనుబంధమే -2

సృజనాత్మకమైన నీకృప చాలు- నే బ్రతికున్నది నీకోసమే -2 "యేసయ్య"

2 : జీవజలముగా నిలిచావని- జలనిధిగా నాలోఉన్నావని జనులకు దీవెనగామార్చావని జగతిలో సాక్షిగాఉంచావని ఉత్సాహగానము నే పాడనా -2

ఏదైనా నీకొరకు చేసేందుకు - ఇచ్చితివి బలమైన నీశక్తిని -2

ఇదియేచాలును నా జీవితాంతము - ఇల నాకన్నియు నీవేకదా -2

| యేసయ్య ॥

3 : మధురముకాదా నీనామధ్యానం మరుపురానిది నీ ప్రేమమధురం మేలుచేయూచు ననునడుపువైనం - క్షేమముగా నా ఈలోకపయనం స్తోత్రగీతముగా నేపాడనా -2

నిజమైన అనురాగం చూపావయ్యా - స్థిరమైన అనుబంధం నీదేనయ్యా -2

స్తుతుల సింహాసనం నీకొరకేగా- ఆసీనుడవై ననుపాలించవా -2

"యేసయ్య"

GATHAKALAMU SONG LYRICS||JOHNSON KANALA||SUDHAKAR RELLA|DEVANAND SARAGONDA||SIREESHA BHAGAVATHULA|NEW YEAR 2025 SONG

గతకాలము నీ కృపలో


గతకాలము నీ కృపలో నను రక్షించి
దినదినమున నీ దయలో నను బ్రతికించి
నీ కనికరమే నాపై చూపించి

నీ రెక్కల చాటున ఆశ్రయమిచ్చావయా!

నా స్థితిగతులే ముందే నీవెరిగి
ఏ కొదువే లేకుండా ఆశీర్వాదించావయా! "2"

నా దేవా..నీకే వందనం
నా ప్రభువా..నీకే స్తోత్రము..
నా దేవా..నీకే వందనం
నా ప్రభువా..నీకే స్తోత్రము..

నా ప్రభువా..నీకే స్తోత్రము..

1. కష్టాలు తీరక..కన్నీళ్లు ఆగక

దినమంతా వేదనలో నేనుండగా..
నష్టాల బాటలో..నా బ్రతుకు సాగక
గతమంతా శోధనలో పడియుండగా..
ఏ భయము నను అవరించక..
ఏ దిగులు నను క్రుంగదీయక
నాతోడునీడవై నిలిచావు
నా చేయి పట్టి నడిపించావు


2. కాలాలు మారగా..బంధాలు వీడగా

లోకాన ఒంటరినై నేనుండగా

నా వ్యాధి బాధలో..నా దుఃఖదినములో
జీవితమే భారముతో బ్రతికుండగా
అరచేతిలో నన్ను దాచిన
కనుపాపల నన్ను కాచిన

నీ చెలిమితోనే నను పిలిచావు

నా చెంత చేరి ప్రేమించావు..

3. ఊహించలేదుగా ఈ స్థితిని పొందగా
నా మనసు పరవశమై స్తుతి పాడగా
ఇన్నాళ్ల నా కల నెరవేరుచుండగా
నా స్వరము నీ వరమై కొనియాడగా
నీవిచ్చినదే ఈ జీవితం
నీ కోసమే ఇది అంకితం
నీ ఆత్మతోనే నను నింపుమయా..
నీ సేవలోనే బ్రతికించుమయా

Asirvadhapu Varshamu Song Lyrics | The Promise 2025 | Telugu Christian Song | Jesus Calls | Latest Christian Song 2025


ఆశీర్వాదపు జల్లులు కురిసే కాలమిదియేగా
ఆత్మ దేవుడు గాలై వీచగా వర్షమై కురియునే "2"
ఉన్నతస్థలి నుండి నీపై ఆత్మను కురిపించున్
ఎండియున్న నిన్ను యేసు మరల బ్రతికించున్ "2" మీ దుఃఖం సంతోషముగా మారే సమయమిది
మీ కలత కష్టం సంపూర్ణముగా తీరే తరుణమిది "2"


1) నీ ముందును నీ వెనుక దీవెన కురిపించున్
వాడియున్న నీ బ్రతుకు ఫలములతో నింపున్ "2"
బీడుగా ఉన్న నీ నేలను ఫలభరితము చేయున్
నీ చేతుల పనియంతటిలో ఆశీర్వాదమునిచ్చున్ "2" || మీ దుఃఖం ||


2) అరణ్యము పొలమువలె మారే సమయమిది
ఎడారిలో సెలయేరు ప్రవహించే తరుణమిది "2"
స్వప్నములో దర్శనములలో యేసే కలుసుకొని
దీర్ఘదర్శిగా నిన్ను మార్చి తానే వ్యక్తమగున్ "2"

|| మీ దుఃఖం ||



మహావర్షము ఒకటి కురియున్
మన దేశము పైన కురియున్ "2"
ఆత్మదేవుడు వర్షమై కురియునే
మహావర్షము ఒకటి కురియున్
మన దేశము పైన కురియున్
ఆత్మదేవుడు వర్షమై కురియునే "2"
ఆశీర్వాదపు వర్షమై కురియు

Monday, December 30, 2024

El Shama Song Lyrics | God Hears | Jessy Paul | Raj Prakash Paul |Latest Telugu Christian Song

ఎల్ షమా


దేవా చెవియొగ్గుము - దృష్టించుము -

నిన్నే వెదకుచున్నాను దేవా సెలవియ్యము - బదులియుము -

నిన్నే వేడుచున్నాను ప్రతి ఉదయం - నిన్ను నమ్మి
ప్రతి రాత్రి - నిన్ను వేడి
ప్రతి ఘడియ - నిన్ను కోరి
ఆశతో వేచి ఉన్న నీవే నా నమ్మకం
ఓర్పుతో కాచి ఉన్న నీవేగా నా ధైర్యం (2) ఎల్ షమా (3)నా ప్రార్ధన వినువాడ

1.ఎండిన భూమి వలె క్షీణించుచున్నాను
నీ తట్టు నా కరములు నే చాపుచున్నాను ఎండిన భూమి వలె వేచి వేచి యున్నాను

నీ తట్టు నా కరములు నే చాపుచున్నాను ఆత్మవర్షం నాపైన కురిపించుము ప్రభు
పోగొట్టుకున్నవి మరలా దయ చేయుము ఆత్మ వర్షం కురిపించి నన్ను బ్రతికించుము
నీ చిత్తము నెరవేర్చి సమకూర్చుము ప్రభు ఎల్ షమా (3)నా ప్రార్థన వినువాడ

2.విడిచిపెట్టకు ప్రభు ప్రయత్నిస్తున్నాను

అడుగడుగు నా తోడై ఒడ్డుకు నన్ను చేర్చవా (2) యెహోవా నా దేవా నీవే నాకున్నది
బాధలో ఔషధం నీ ప్రేమే కదా (2) ఎల్ షమా (3)నా ప్రార్థన వినువాడ నీ శక్తియే - విడిపించును
నీ హస్తమే - లేవనెత్తును
నీ మాటయే - నా బలము
నీ మార్గము - పరిశుద్ధము (2) ఎల్ షమా (3)నా ప్రార్థన వినువా

Sunday, December 29, 2024

Nee Krupatisayamu Song Lyrics || Telugu Christian Song 2025 || Dr.Asher Andrew || John Pradeep || The Life Temple

నీ కృపాతిశయమును

పల్లవి:-
నీ కృపాతిశయమును అనునిత్యము
నే కీర్తించెదా తరతరములకు
నీ విశ్వాస్యతను నే ప్రచురింతును
ఆ.పల్లవి:-
నీ కృపా నీ కృపా ఆకాశముకంటే హెచ్చైనది
మౌనిగా యెటులుండెదా సాక్షిగా ప్రచురించకా
నా తుది శ్వాస వరకు నీ చెంత చేరేవరకు

1. ఇంకా బ్రతికి ఉన్నామంటే - కేవలము నీ కృపా
ఇంకా సేవలో ఉన్నామంటే - కేవలము నీ కృపా
ఏ మంచితనము - లేకున్ననూ కొనసాగించినది నీ కృపా

- నిలబెట్టుకొన్నది నీ కృపా
||నీ కృపా||

2. పది తరములుగా వెంటాడిన - మోయాబు శాపము
నీ కృపను శరణు వేడగా - మార్చేనే వెయ్యి తరములు
అన్యురాలైన ఆ రూతును - ధన్యురాలుగా మార్చినది
నీ కృపయే నన్ను దీవించగా -

ఏ శాపము నాపై పనిచేయదు
||నీ కృపా||

3. ఆరోగ్యం ఉద్యోగం ఉన్నాయంటే - కేవలము నీ కృపా
మెతుకు బ్రతుకు ఉన్నాయంటే - కేవలము నీ కృపా
కృపతోనే రక్షణనిచ్చావు - నా క్రియల వలన కానే కాదు
జీవితమంతా ఋణస్థుడను - నీయందే నిత్యము అతిశయము
||నీ కృపా||

4. ఇల్లు వాహనం ఉన్నాయంటే - నీదు కృపాదానమే
బలము ధనము ఉన్నాయంటే - నీదు కృపా దానమే
ఏ అర్హత నాలో లేకున్ననూ - కృపా భిక్షయే నా యెడల
జీవితమంతా కృతజ్ఞుడను - జీవితమంతా పాడెదను
||నీ కృపా||

5. ప్రియులే నన్ను విడనాడినా - శోకమే నా లోకమా
అనాధగానే మిగిలానే - నా కథ ముగిసినదే
నీ కుడిచేతిలో ఉంచగనే - బెన్యామీను వంతుగా మారే
ఐదంతలాయే నా భాగ్యము -
విధిరాతనే మార్చెనే నీ కృపా

||నీ కృపా||

Sthuthiki Patruda Song Lyrics || Latest Hosanna Ministries Nellore 2025 Song ||Pastor Anand JayKumar

స్తుతికి పాత్రుడా


పల్లవి:-
స్తుతికి పాత్రుడా
నా హృదయాన కొలువైన - స్తోత్రార్హూడా (2)


1. అలసిపోతిని - జీవిత పయనంలో
బలపరచితివి - జీవాహారముతో (2)
లెమ్ము బహుదూర - ప్రయాణముందని
నీ ఆత్మ శక్తితో - నడిపించుచుంటివి (2)
యేసయ్యా - యేసయ్యా
కృతజ్ఞతా స్తుతులు
||స్తుతికి పాత్రుడా||


2. కృపగల దేవా - కలువరి నాధా
నీలా ప్రేమించి - క్షమించువారెవరు (2)

నీవే నా యెడల - కృప చూపకపోతే

నేనీ స్థితిలో - ఉండేవాడనా (2)
యేసయ్యా - యేసయ్యా
కృతజ్ఞతా స్తుతులు
||స్తుతికి పాత్రుడా||


3. సరిచేసితివి - నా జీవితమును
పలికించితివి - జీవన రాగాలు (2)
నిన్నే నా మదిలో - నిలుపుకొంటిని
సీయోనులోనుండి - ఆశీర్వదించుము (2)
యేసయ్యా - యేసయ్యా
కృతజ్ఞతా స్తుతులు

||స్తుతికి పాత్రుడా||

Yessaya na pranama Song lyrics|| Hosanna Ministries new year song 2025||Latest Christian Telugu Songs 2025

యేసయ్య నా ప్రాణమా 


పల్లవి: యేసయ్య నా ప్రాణమా 

ఘనమైన స్తుతిగానమా -2 

అద్భుతమైన నీ ఆదరణే - ఆశ్రయమైన 

నీ సంరక్షణయే నను నీడగ వెంటాడెను - 

నే అలయక నడిపించెను నా జీవమా - 

నా స్తోత్రమా - నీకే ఆరాధన నా స్నేహము 

- సంక్షేమము - నీవే ఆరాద్యుడా



1 : చిరకాలము నాతో ఉంటానని - 

క్షణమైనా వీడిపోలేదని 

నీలో ననుచేర్చుకున్నావని - 

తండ్రితో ఏకమై ఉన్నామని 

ఆనందగానము నే పాడనా -2

ఏదైనా నాకున్న సంతోషము

 నీతోనే కలిగున్న అనుబంధమే -2

సృజనాత్మకమైన నీకృప చాలు- 

నే బ్రతికున్నది నీకోసమే -2 ||యేసయ్య||



2 : జీవజలముగా నిలిచావని- జలనిధిగా నాలో

ఉన్నావని జనులకు దీవెనగామార్చావని జగతిలో 

సాక్షిగాఉంచావని ఉత్సాహగానము నే పాడనా -2

ఏదైనా నీకొరకు చేసేందుకు -

 ఇచ్చితివి బలమైన నీశక్తిని -2

ఇదియేచాలును నా జీవితాంతము - 

ఇల నాకన్నియు నీవేకదా -2

|| యేసయ్య ॥



3 : మధురముకాదా నీనామధ్యానం మరుపురానిది

 నీ ప్రేమమధురం మేలుచేయూచు 

ననునడుపువైనం - క్షేమముగా 

నా ఈ లోకపయనం స్తోత్రగీతముగా నేపాడనా -2

నిజమైన అనురాగం చూపావయ్యా - 

స్థిరమైన అనుబంధం నీదేనయ్యా -2

స్తుతుల సింహాసనం నీకొరకేగా- 

ఆసీనుడవై ననుపాలించవా -2

|| యేసయ్య||

Saturday, December 14, 2024

Christmas Mashup 2024 Song Lyrics| #JCNM Worship | #Christmas Telugu Songs | Latest Christmas Songs 2024

Christmas Mashup 2024


1.
భూమికి పునాదులు వేసినవాడు ఎలోహిం
జేనతో ఆకాశములను కొలిచినవాడు ఎలోహిం
ప్రపంచములను చేసినవాడు ఎల్ షద్దాయి
నక్షత్రములకు నామకరణము చేసినవాడు...

ఎల్ షద్దాయి
వాక్యమై....శరీరధారియై ,……కృపాసత్యసంపూర్ణుడై....
రిక్తుడై.......అభిషిక్తుడై,………సర్వలోక రక్షకుడై........
మనలో, మనతో ఒకటిగా ఇలా జీవింప

దిగివచ్చే రారాజు యేసు..
తనతో మనలను కొనిపోవ మరల రానున్న

మహారాజు క్రీస్తు...


2. పరిశుద్ధాత్మతో పుట్టిన పరిశుద్ధుడు
పరిశుద్ధుడు...అతిపరిశుద్దుడు
పదివేలలో అతిసుందరుడు
కన్యకగర్భమున జనియించె కారణజన్ముడు
పరమాత్ముడే పసిబాలుడై
పరమతండ్రి ప్రతిరూపమై
కారుచీకటిలో కాంతిరేఖగా వెలిసెనే
మహిమ రాజ్యమునకు - అర్హత కలిగించెనే
మా ఇలవేల్పు నీవే దేవా - మా ఆధారం నీవే ప్రభువా
మా ఇలవేల్పు నీవే దేవా - మా ఆధారం నీవే ప్రభువా ||2||
నిను పోలినవారెవరు లేరయ్యా - ఈ సృష్టిలో
నీకు సాటిలేరయ్యాయా - ఈ జగతిలో || 2 ||

తలవంచెను - ఆకాశమే
తలదించెను - భూలోకమే
ప్రణమిల్లెను - పరలోకమే
సర్వలోకానికి రక్షణానందమే


3. నింగిలోని తారలన్నీ ఏకమై నిత్యదేవుని ఆరాధించిరి
ఆకాశాన దూతగనము తేరిచూచి

స్తోత్రగానమే ఆలపించిరి || 2 ||
రారాజుపుట్టెనని - రక్షకుడు పుట్టెనని
తోడుండుదేవుడని - కాపాడే నాధుడని || 2 ||
షాలోమ్- సర్వలోకానికి
షాలోమ్ - సర్వమానవాళికి
షాలోమ్ - స్వరములెత్తిపాడేదం
షాలోమ్......


చరణం : దారిచూపే నక్షత్రమే

నన్ను చేసినోడు పుట్టాడని
సృష్టి అంత సంబరాలు చేసెనే సృష్టికర్త పుట్టాడని
జ్ఞానమునకాధారమైనవానిని - జ్ఞాణులే ఆరాధించిరి
ప్రధానకాపరి పుట్టినవానిని - గొల్లలంత గుర్తించిరి
షాలోమ్- సర్వలోకానికి
షాలోమ్ - సర్వమానవాళికి
షాలోమ్ - స్వరములెత్తిపాడేదం
షాలోమ్......
క్రిస్మస్ - సర్వలోకానికి
క్రిస్మస్ - సర్వమానవాళికి
క్రిస్మస్ - స్వరములెత్తిపాడేదం
క్రిస్మస్ --- క్రిస్మస్


4. వచ్చాడురోయ్ - దివినుండి భువికి

రారాజుగా యేసు మహారాజుగా
పుట్టాడురోయ్ - సర్వలోకానికి

గొప్ప రక్షణగా యేసు అద్భుతముగ (2)
రాజ్యము విడిచే ఓహో ఓహో ఓహో -

రాజసం మరిచే— ఓహో ఓహో ఓహో
తండ్రిని విడిచే ఓహో ఓహో ఓహో -

త్యాగమున్ ధరించే ఓహో ఓహో ఓహో ఓహో ఓ….
జగాలలో ….తరాలలో…. యుగాలలో…. ఉన్నవాడు
అందరిలో....అన్నింటిలో....అంతటా వ్యాపించినాడు (2)
ఆయనే…. ఉన్నవాడు ..అనువాడు
ఆయనే....మనకు తోడు యెల్లవేళలా వుండువాడు
జై జై జై జై జై జై జై జై జై బోలో జై
జై జై జై జై జై జై జై జై జై బోలో జై (2 )
జై బోలో యేషు మసీకి
జై జై జై జై జై జై జై జై జై బోలో జై
జై జై జై జై జై జై జై జై జై బోలో జై (2 ) BARUCH ADONAI
ELOHIM TZ’ VA’OT
ASHER HAYAH
V’ HOVEH V’YAVO
BARUCH ADONAI
ELOHIM TZ’ VA’OT
ASHER HAYAH
V’ HOVEH V’YAVO యూదాగోత్రపు సింహము - ఉదయించే మనకోసమే

దావీదు వేరు చిగురు - ధరియించె దాసుని రూపం
తనువై-కానుకై - దీనుడై - రక్షణై - నిరీక్షణై - ఇలా వచ్చెను
ఆ మ్రానుపై - యాగమై - గాయమై - రక్తమై -

మరణమై మరి లేచెను.....
విజయమై - ధైర్యమై - నిత్యమై - సకలమై -

ఆదియు - అంతమై
జీవమై - సర్వమై - నీలిచెనే మా పక్షమై
సర్వాధికారియై - సర్వోన్నతుడై...సమీపస్థుడై...

సదాకాలము

CHRISTMAS SUBHAVELALO-2 Song Lyrics|JK Christopher |Suresh Nittala |Sharon Sisters |New Telugu Christmas Song 2024


క్రిస్మస్ శుభవేళలో - 2


క్రిస్మస్ శుభవేళలో - మన
అందరి హృదయాలలో

ఆనందమానందమే - మనసంతా సంతోషమే-2

"స్తుతియించి  ఆరాదిద్దాం  - ఆ ప్రభుని 

ఘనపరచి   కీర్తించుదాం

రక్షకుడు పుట్టాడని - మనకు రక్షణ తెచ్చాడని "



1. దావీదు  పురమందు  రక్షకుడు
మన కొరకై  జన్మించాడు

దేవాధిదేవుని కుమారుడు రిక్తునిగా భువికొచ్చాడు  -2

ఆ ప్రభువే నరుడాయెను - లోకమును  ప్రేమించెను

మన పాపము తొలగించెను - పరిశుథ్థులుగా చేసెను-2

   ||స్తుతియించి||



2. సర్వోన్నతమైన స్థలములలో  - దేవునికే మహిమ

ఆనందమే ఆశ్చర్యమే  -  సంతోషం  సమాధానమే -2

దూతాళి  స్త్రోత్రించిరి -  కాపరులు చాటించిరి

ప్రభుయేసు  పుట్టాడని - మనకు తోడై ఉంటాడని-2

  ||స్తుతియించి||
                      

                           
3. వింతైన తార  వెలసిందని - ఙ్ఞానులు కనుగొంటిరి

ఆ తార వెంబడి వారొచ్చిరి - ప్రభుయేసుని దర్శించిరి-2

రాజులకే  రాజని - ప్రభువులకే ప్రభువని

కానుకలు అర్పించిరి - వినమ్రతతో  పూజించిరి-2

      ||స్తుతియించి||

Tuesday, December 10, 2024

Megham tholgindhi Song Lyrics | 𝑬𝑬 𝑨𝑵𝑨𝑵𝑫𝑨𝑴 𝑵𝑬𝑬 𝑱𝑨𝑵𝑴𝑨𝑻𝑯𝑶 Song Lyrics | 4K Video Song | Bro. Samuel Karmoji | 𝗡𝗘𝗪 𝗖𝗛𝗥𝗜𝗦𝗧𝗠𝗔𝗦 𝗦𝗢𝗡𝗚 𝟮𝟬𝟮𝟰


మేఘం తొలగింది ఈ రోజునా
ఏదో ఆశ చిగురించే మా మనసునా
ఎదురు చూసి చూసి అలసిపోయి ఉన్నామని

మా చీకట్లు తరిమేసే వెలుగేదని అయ్యో

నా బ్రతుకు ఇంతేనేనా అంతేనా అనుకున్నా చీకట్లు చీల్చేసి మన కట్లు తెంచేసే

మనకోసం వచ్చేసే రక్షకుడు ఆ యేసే
ఏంటో ఈ ఆనందం అణువణువు అనుబంధం తెచ్చేను

నీ జననం దేవుడు మనకు తోడుగా ఉన్నాడు రా
ఇమ్మానుయేలు తోడు మనకు చాలురా ఎవరు విడిచి పోతే

మనకు ఏందిరా ఇమ్మానుయేలు తోడు

మనకు చాలు రా అరెరే భయము విడచి ముందుకు సాగరా అశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు

తండ్రి సమాధాన అధిపతి వచ్చాడిలా తెచ్చాడిలా సంబరం


1. అనుకున్నాను పాపితో స్నేహం చెయ్యవని చెయ్యలేవని

తేలిసిందిపుడే నాలాంటి వారికై పుట్టావని ప్రేమించావని

నీ ప్రేమ నన్ను ఎన్నడూ వీడిపోదని ప్రతి రేయి పగలు

నిన్ను తలచి సంతసించనీ ఈ ఆనందం

నీ జన్మతో మొదలాయే మొదలాయే
|| చీకట్లు ||


2. కలవరమొందకు కలవరం ఎందుకు కలలన్నీ

కరిగి పోయెనని లోకాలనేలే రాజొకడు మనకొరకు పుట్టాడని

చరిత మార్చునని తన ప్రేమ నిన్ను ఎన్నడూ విడచి పోదని
ముందుంది మంచి కాలమని మదిని తలచనీ
ఈ ఆనందం తన జన్మతో మొదలాయే మొదలాయే