Pages - Menu

Pages

Wednesday, March 5, 2025

Kalavarilo Ni Siluva Tyagame Song Lyrics|| Good friday Songs || Lent days Songs|| Christian Telugu Songs


కలువరిలో నీ శిలువ త్యాగమే కరిగించెను నా పాప హృదయమే (2) నీవు కార్చిన ఈ రుధిర ధారలే (2) కలిగించెను పాపికి పరిహారమే (2)
ఓ మానవా ఇది మన కోసమే
ఈ గొప్ప, ప్రేమ బలియాగము (2) 1. మన దోషము కొరకై నలుగగొట్టబడెను
మన అతిక్రమ బాధలు శిలువపై మోసెను (2)
కొరడా దెబ్బలతో గాయపరచబడెను
ఆ గాయములె నిన్ను స్వస్థత పరచెను (2)
ఓ మానవా ఇది మన కోసమే ||కలువరిలో||



2. తలపైన ముళ్ళ ప్రక్కలో బల్లెము

చేతులలో మేకులు భరియించినావే (2)
వధకు తేబడిన గొర్రెపిల్ల ఓలే
మౌనముగా శిక్షను సహియించినావే (2)
ఓ మానవా ఇది మన కోసమే ||కలువరిలో||


3. ప్రతి పాపము కడుగును యేసుని రక్తమే
ప్రతి శాపము బాపును ఆ ప్రియుని రక్తమే (2)
నీకై మరణించి విమోచనను కలిగించిన
ఆ ప్రియుని చెంతకు నీవు చేరుమా (2)
ఓ మానవా ఇది మన కోసమే ||కలువరిలో||

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.