Pages - Menu

Pages

Wednesday, March 5, 2025

Nee Snehamu Song Lyrics | Good Friday Songs In Telugu 2024|| Lent Days song#Good FridaySong |JesusChanan|



నీ స్నేహము


నీ స్నేహము నన్ను మనిషిని చేసింది..

నా హృదయముకు  ప్రేమించుట నేర్పింది ||2|| విలువైన రక్తము, నా కోరకు దారపోసి,

నిలువెల్లా నలిగితివా, ఈ ఘోర పాపికొరకు దోషములన్నీ కడిగి నాలో జీవం నింపితివి ప్రేమమయుడా.. సర్వోన్నతుడా…

మహిమాన్వితుడా… నా యేసయ్య || నీ స్నేహము||


1.నా తలమీద ప్రవహించే సంద్రము వంటి ఈ,

బాల్యము   నుండి నే చేసిన పాపకార్యములు ||2|| నా దుష్కార్యములన్నీ నీ వీపు వెనకవేసి దీవెనగా చేయుటకు నా పాపమంతటిని  మరిచావు నా పాపమంతటిని  మరిచావు….| ప్రేమమయుడా|2|

|| నీ స్నేహము||


2. సాద్యముకాని కార్యములు నీ దయతో పొందితిని నీ మేలులు మరిచి పశుప్రాయుడనై వీపును చూపితిని ||2|| నాఅవిదేయతలన్నీ నీ వెలితో చెరిపి,  నా ఎముకల నుండి వాక్యమునే  అగ్ని కణముగా దాచావు అగ్ని కణముగా దాచావు…….ప్రేమమయుడా|2|

|| నీ స్నేహము||



3. మరణము వరకు నీతోనే నే ఉంటానంటిని స్థిరముగా నిలిచి నీతో ఉండుటకలాగ మార్చితిని కుమారుని రక్తముతో హిమంత తెలుపుచేసి పరిశుద్దులలో నను చేర్చుటకు సిలువ కిరణమై వెలిగావు సిలువ కిరణమై వెలిగావు…             || నీ స్నేహము||

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.