నీవు ఉన్నవాడవు
ఆలోచించితిన్ నే నడచిన మార్గము గూర్చి
ధ్యానించెదను నీ దయను
తిరిగి చూచితిన్ మొదలైన కాలము గూర్చి
నీ ప్రేమ నను కనపరచెను
శూన్యముతో ప్రారంభించితిని
తృప్తితో నన్ను నింపితివి
నీవు ఉన్నవాడవు
మేలు చేయు వాడవు
కడ వరకు చేయి విడక నడిపించు వాడవు
దర్శనం మాత్రమే నా సొంతము
చేతిలో ఉన్నదంతా శూన్యము
దర్శనం యిచ్చి నాతో నడిచితివి
సిగ్గుపరచక నన్ను హెచ్చించితివి
కోరుకున్నదంతయు నాకిచ్చితివి
అధికమైన దీవెనతో నను నింపితివి
లేమిలో విడువక నను నడిపితివి
ఎనలేని కృపతో నన్ను నింపితివి
ఇంతవరకు నడిపిన కృప యిక ముందు నడుపును
ఇంతవరకు కాచిన కృప యిక ముందు కాచును
No comments:
Post a Comment
Suggest your Song in the Comment.