Pages - Menu

Pages

Wednesday, May 6, 2026

Nannenthagano Neevu Koravuga Song Lyrics#JoshuaShaik | Pranam Kamlakhar | Bro Anand | New Telugu Christian Songs 2026

నన్నెంతగానో నీవు


నన్నెంతగానో నీవు కోరావుగా

బ్రతుకంత నాకు తోడై ఉన్నావుగా

రచించావు నన్ను నీవు

క్షమించావు నన్ను నీవు

నీ ప్రేమ చాలు నాకు నా యేసయ్య



1. ఏముంది ఈ జగాన - ఎదురీత సాగరాన

నా జీవ నావ నీవే నా యేసయ్య

తీరాలే దూరమైన - కనుమేర చీకటైన

ఏ భయము లేదు నాకు నీవుండగా

అలజడులే రేగినా - అధికారం నీదనీ

అనుదినము నీ కృపా - స్తుతియించి పాడనీ

ప్రియమైన యేసయ్య - నడిపించు నన్నిలా



2. ఊహించలేను దేవ నీవు లేని జీవితాన్ని

ఓ నిమిషమైన నేను మనలేనుగా

నాలోని ఆశ నీవే - ఎదలోని ధ్యాస నీవే

నీ పాదసేవకేగ ఈ జీవితం

ఆణువణువు నీవనీ- ఇహమందు పాడనీ
కడవరకు సాక్షిగా - కలకాలం సాగనీ

ప్రియమైన యేసయ్య - కరుణించు నన్నిలా

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.