Halaman

Pages - Menu

Pages

Thursday, May 28, 2026

NA HRUDHAYALOGILILO SONG LYRICS | A.R. Stevenson | S.P. Balasubrahmanyam | Old Christian Songs


నా హృదయ లోగిలిలో


నా హృదయ లోగిలిలో కొలువైన నా స్వామి
నీ ప్రేమ కౌగిలిలో నను ఒదిగిపోనీ అ.ప. : నీ ఆత్మతో నను నిండనీ - నీ సాక్షిగా ఇలలో నన్నుండనీ


1. నాలోపల సంచరించి - నాతోభుజియించి
జీవపుమార్గము చూపించి - సరిగానడిపించి
నా జీవితం వెలిగించినావా -

నీ రూపమే నాలో ముద్రించినావా


2. బలహీనతలను హరియించి - శక్తితో దీవించి
అజ్ఞానము నిర్మూలించి- సత్యము బోధించి
నా భారమే భరియించినావా -

నీ శాంతినే నాలో స్థాపించినావా


3. అనురాగముతో బంధించి - ఆప్యాయత పంచి
ఆనందము ననుగ్రహించి - ఆత్మీయత పెంచి
నా శోకమే తొలగించినావా -

స్తుతిగానమే నాలో పలికించినావా

Prabhu yesu namame saranam song lyrics|| old christian songs || SP Balu garu ||

ప్రభు ఏసు నామమె

శరణం


ప్రభు ఏసు నామమె శరణం
దినమెల్ల చేసెద స్మరణం
హృదయాత్మతొ గృహ ధ్యానమే
పలికించె పెదవిని స్వరాలాపం
ప్రభు ఏసు నామమె శరణం
దినమెల్ల చేసెద స్మరణం
హృదయాత్మతొ గృహ ధ్యానమే
పలికించె పెదవిని స్వరాలాపం
ప్రభు ఏసు నామమె శరణం
దినమెల్ల చేసెద స్మరణం


1. కనుల పండుగ కనబడె నాధుడు
వీనుల విందుగ వినబడె నాదం
కనుల పండుగ కనబడె నాధుడు
వీనుల విందుగ వినబడె నాదం
ప్రియముగ నాలో కురిపించెనుగా
ఆత్మ ప్రవాహం ప్రభు వరములతో
జయమౌ ప్రగతం ప్రభు నామం
ప్రభు ఏసు నామమె శరణం
దినమెల్ల చేసెద స్మరణం


2. నీకు ముందుగ నడిచెద నేనని
నీతి బంధువై నడిపెను ఏసు
నీకు ముందుగ నడిచెద నేనని
నీతి బంధువై నడిపెను ఏసు
మార్గము నేనే జీవము నేనే
సత్యము నేనని పలికిన ఏసే
శరణం శరణం శుభ చరణం
ప్రభు ఏసు నామమె శరణం
దినమెల్ల చేసెద స్మరణం


3. రాతి గుండెను కరిగించగనే
కాంతి గుండెలో వెలిగించెనుగా
రాతి గుండెను కరిగించగనే
కాంతి గుండెలో వెలిగించెనుగా
ఉదయించెనునా ఏసు ప్రభావం
హృదయపు గానం ఏసుని నామం
స్తోత్రం స్తోత్రం స్తుతి స్తోత్రం
ప్రభు ఏసు నామమె శరణం
దినమెల్ల చేసెద స్మరణం
హృదయాత్మతొ గృహ ధ్యానమే
పలికించె పెదవిని స్వరాలాపం
ప్రభు ఏసు నామమె శరణం
దినమెల్ల చేసెద స్మరణం

Neeve Nakadharamu Song Lyrics || Fr.S.J.Berchmans telugu songs || Christian Telugu Songs

నీవే నాకాధారము


నీవే నాకాధారము - నీలోనే ఆనందింతున్ (2) ప్రార్ధించి బలమునొందే ప్రభువా నన్ను ఆదరించవే (2)


1.ఎదురించువారె లేచినను

రక్షణయె ఇక లేదన్నను (2) కేడెము నీవే మహిమయు నీవే -

నా తల ఎత్తవు నీవెనయ్యా (2)


2. పూర్వములో జరిగినవి తలంచి

కలవరం చెందినను (2)
జరిగినవన్ని మేలుకోరకై

తండ్రి నీవే మార్చినావు (2)


3. నేడు చూస్తున్న ఐగుప్తీయులను

ఇక మీదెన్నడు చూడబోను(2)
ప్రభువే నాకై యుద్దం చేయును

వేచియుందును వోపికతో || (2)
నీవే నాకాధారము - నీలోనే ఆనందింతున్ (1)
పండుకొని మేలుకొందును - నిద్రింతు నెమ్మదితొ (1)

Ninne ne nammukunnanu song lyrics || Adbutham Cheyumaya Song Lyrics || Paul Moses || FT. Asha Ashirwadh || Latest Telugu Christian Song 2024

అద్భుతం చేయుమయా


నిన్నే నే నమ్ముకున్నానూ...నీవంటి వారు ఎవరయ్యా
నిన్నే నే నమ్ముకున్నానూ...నీవంటి వారు లేరయ్యా"2"
అద్భుతం చేయుమయా నా జీవితంలో...
నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్య. "2"
|| నిన్నే నే ||


1. నీవే ఏదైనా చెయ్యలంటూ...

నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను " 2 "
తప్పక చేస్తావని నిన్ను నమ్మి "2"
నీ కరముపై దృష్టి వుంచినానయ్యా "2"
అద్బుతం చేయుమయా నా జీవితంలో...
నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్య. "2"
|| నిన్నే నే ||


2. నిందలు అవమానాలు  సహించుకుంటూ...

నీ రెక్కల నీడనే ఆశ్రయించాను "2"
నీ వాగ్ధానములను చేతపట్టి "2"
నీ ముఖముపై దృష్టివుంచి నానయ్యా " 2 "
అద్బుతం చేయుమయా నా జీవితంలో...
నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్య. "2"

|| నిన్నే నే ||

MAARUTUNDI NEE JEEVITAM SONG LYRICS ||THANDRI SANNIDHI MINISTRIES || Latest Christian Songs 2026

మారుతుంది నీ జీవితము


మారుతుంది నీ జీవితము - వేదన చెందకుమా..!
మరచిపోడు నిను యేసయ్యా - మాటే నమ్ము సుమా! - 2
మోసే భారం - నువు చేసే త్యాగం - 2
ఎదురితలన్ని - ఎదకోతలన్ని
చూసేను నా దైవం - చేయునులే సాయం
చూసేను నా దైవం -చేయునులే న్యాయం
|| మారుతుంది ||


1. ఆలస్యం అయ్యిందని - ఆక్రందన చెందకు
రోజులు మారవని - రోధించకు - 2

ఆ రోదననే - ఆరాధనగా
మనుగడనే - మాధుర్యంగా -2
మలచును నా దైవం - విడువకు నీ ధైర్యం - 2
|| మారుతుంది ||


2. నీ కథ మారిందని - నిరాశలో ఉండకు
నీ వ్యధ తీరదని - చింతించకు -2
నీ చింతలనే - చిరునవ్వులుగా
యాతననే స్తుతి కీర్తనగా - 2
మార్చను నా దైవం - వీడకు విశ్వాసం - 2

|| మారుతుంది ||

Adige Vatikante Song Lyrics || Adhikamugaa cheyagaladu Song Lyricsll THANDRI SANNIDHI MINISTRIES NEW YEAR SONG ll

అధికముగా చేయగలవు

యేసయ్యా


అడిగే వాటికంటే ఊహించే వాటికంటే
అధికముగా చేయగలవు యేసయ్యా
నన్ను నడిపే సారధివి నీవేనయ్యా "2"

నాకు చాలిన దేవుడవు నీవేనయ్యా
"అడిగే "



1. చేసి ఉన్న ప్రార్ధన నేను మరచిపోయినా
నువ్వు మరచిపోవుగా నా మంచి నాయనా "2"
అవసరాన్ని తీర్చమనే నా దీన యాచన "2"
పట్టజాలపోతినిగా నీవిచ్చిన దీవెన "2"
"అధికముగా "



2. అల్పమైన వాటిని ఆశించును నా హృదయం
అధికమైన మేళ్ళనూ దాచును నీ మంచితనం "2"
ఏది నిన్ను కోరాలో ఎరుగదు నా వెర్రితనం "2"

ఏది నాకు కావాలో ఎంచి యిచ్చు నీ జ్ఞానం "2"

"అధికముగా "

Gaadandhakaramulo Song Lyrics | Telugu christian song 2026 | Phebe Joseph, JK Christopher, Philip, Sharon sisters, Joel

గాఢాంధ కారములో



గాఢాంధ కారములో నే నడిచిన వేళలలో

కంటి పాపవలె నన్ను కునుకాక కాపడును

ప్రభువైన యేసునకు జీవితమంత పాడెదన్

జడియను బెదరను నా యేసు నాతో నుండగా



1. మరణపు లోయలలో నే నడచిన వేళలలో

నే దుడ్దు కర్రయు నీ దండము ఆదరించును

శుధాత్మతో నింపును నా గిన్నె పొర్లు చున్నది

జడియను బెదరను నా యేసు నాతో నుండగా



2. అలలతో కొట్టబడినా నా నావలో నేనుండగా

ప్రభు యేసు క్రుప నన్ను విడువక కాపాడును

అభయమిచ్చి నన్ను అద్దరికి చేర్చును

జడియను బెదరను నా యేసు నాతో నుండగా



3. పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లినను

నీ క్రుప నను విడువదు నీ కనికరం తొలగదు

నీ నిత్య సమాధానంతో నన్ను నడిపించును

జడియను బెదరను నా యేసు నాతో నుండగా

Monday, May 18, 2026

Margamu Nene Annadu Yesu Song Lyrics || Telugu Christian Song || Rev. Dr. PHILIP P JACOB || #viral #song

మార్గం నేనే అన్నాడు యేసు



మార్గం నేనే అన్నాడు యేసు
సత్యం నేనే అన్నాడు యేసు
జీవం నేనే అన్నాడు యేసు
నాకై మరణించి లేచాడే నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని

విడిపించి జీవం ఇచ్చాడే
నాలో పరిశుద్ధాత్మ నింపి శక్తితో నను నడిపి
గమ్యం చేరుస్తాడే
రానున్న రారాజు నా యేసు మహా రాజు


1. స్వస్థపరచే నా మంచి యేసు
స్వేచ్ఛనిచ్చే నా మంచి యేసు
శ్వాస నింపే నా మంచి యేసు
హృదిలో చోటిస్తే నివసిస్తాడే
||నాలో||


2. విడుదల నిచ్చే నా మంచి యేసు
విజయం ఇచ్చే నా మంచియేసు
విరోధిని జయించే నా మంచి యేసు
విశ్వాస వీరునిగా మలిచాడే
||నాలో||


3.రక్తము కార్చిన నా మంచి యేసు
రక్షణ ఇచ్చిన నా మంచి యేసు
రమ్మని పిలచిన నా మంచి యేసు
చిరకాలం ఆయనతో ఉండాలని

||నాలో||

Na Yesu Manchivadu Song Lyrics| Raj Prakash Paul Songs | Worship Conference Songs #worshipconference2025

నా యేసు మంచివాడు


నా యేసు మంచివాడు.... (4) తేజోమయుడు మృత్యుంజయుడు చల్లని దేవుడు
జ్యోతిర్మయిడు జీవనదాత చక్కని దేవుడు..... (2)


1. మహాశ్చర్య కార్యములెన్నో _

చేయువాడు ఆయన మాత్రమే (2)
ఆయన బహుబలముతో_ మనకు

విడుదల_ జయము అందించెను (2)


2. పరక్రమ కార్యములు ఎన్నో _

చేయువాడు ఆయన మాత్రమే (2)
ఆయన శుద్ధుడు_ఘనుడు_

విజయవంతుడు_ ఆశ్చర్యకరుడు (2)


3. పాపాన్ని గెలిచిన_ మరణము

జయించిన_ శక్తివంతుడు
నీకై నాకై ప్రాణం పెట్టిన ప్రేమామయుడు....(2)

Na Prananiki Pranam Songs Lyrics | Telugu Worship Song 2025 | Re-Imagined Cover – WTP Worship | ✝️ Jesus Song

నా ప్రాణానికి ప్రాణం


నా ప్రాణానికి ప్రాణం - నా జీవానికి జీవం
నా హృదయానికి హృదయం నీవే నీవే
నా పాదాలకు దీపం నా నావకు తీరం
నా పయనానికి గమ్యం నీవే నీవే
నా కొండ నీవే నా కోట నీవే
నాకన్నీ నీవేలే యేసయ్యా

1. ఒంటరి బ్రతుకున జంటగ నిలిచే తోడు నీవే
చీకటి బ్రతుకున వెలుగును నింపే జ్యోతివి నీవే
ఇమ్మానుయేలు నీవే - మహిమాన్వితుడవు నీవే ||2||
నా కన్నీ నీవేలే యేసయ్యా


2. కృంగిన వేళలో ఆదరణిచ్చే స్వస్థతా నీవే
వేదన రోదన శోధనలోన బలము నీవే
యెహోవా రాఫా యెహోవా యీరే ||2||
నా కన్నీ నీవేలే యేసయ్యా


3. కరుణతో కలుషము మాపే కర్తవు నీవే
పాప క్షమాపణ శాప విమోచన ముక్తివి నీవే
నా రక్షణ నీవెలే నిరీక్షణ నీవెలే ||2||
నా కన్నీ నీవేలే యేసయ్యా

Tharinchiponi Song Lyrics | God's Love | A Pranam Kamlakhar Musical | Latest Christian Telugu Songs

తరించిపోనీ


తరించిపోనీ నీ ప్రేమలోనే
ఓ యేసుదేవా నీ దాసినై
నీ సేవలోనే నేనుండిపోనీ
నీ ప్రేమగీతం నే పాడుకోనీ
నీ కంటిపాపై నిలువగలేనా
ఈ జీవితం నీదనీ ఏలుకోలేవా


1. ఉదయం రవికిరణం వరమై తాకనీ
మనసే మైమరచి నిను సేవించనీ
వెన్నెలే సాక్షిగా స్తుతులనే పాడనీ
కన్నులా రూపమే దీపమై వెలగనీ
చక్కనీ చెలిమిని ప్రేమతో కోరెదా


2. వదనం నవకమలం నీతో సాగనీ
మధురం నీ చరితం నేనే పాడనీ
మోక్షమే జీవమై హాయిగా తాకనీ
యేసుతో ప్రాణమై సాగనీ పయనమే
కమ్మనీ గానమై దైవమా చేరెదా

VAAKYAME SAREERA DHAARIYAI SONG LYRICS| Akshaya Praveen | Dollie Rose | Pranam Kamlakhar


వాక్యమే శరీరధారియై


వాక్యమే శరీరధారియై ఈ భువికేయెతెంచెను
దేవుడే దివ్య రూపమై పసిబాలునిగా జన్మియించెను
సర్వాధికారి యేసుడే దీనుడిగా దిగివచ్చెను

ఆదియందున్న వాక్యమే వెలుగై ఉదయించెను
నిసస నిసస నిసస నిసస నిరిగరిగరిని
నిరిరి నిరిరి నిరిరి నిరిరి పమపగరినిస ఈ దినం శుభ దినం యేసు రాజు పుట్టే మరియకు
ప్రతి దినం సునాదము చేయుదము రారాజుకు

1) దైవ కుమారుడు మనుష్య కుమారునిగా మహిలో నివసించెను
ఆల్ఫా ఒమేగా అయిన దేవుడు ఇమ్మనుయెలుగా ఉధ్బవించెను

ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు
నీలో నివసించుటకు సింహాసనమునే విడిచెను

2) మహిమస్వరూపుడు ఆదిసంభూతునిగా ఇలలో పిలువబడెను
ఆ మహిమను విడిచిన దేవుడు నీకై శిశువుగా మార్చబడెను
నిత్యుడగు తండ్రి సమాధానకర్త అధిపతి అయిన దేవుడు
సర్వసృష్టికర్త మానవరూపిగా జన్మియించెను

Nee Chethi Kaaryamu Song Lyrics| #JoshuaShaik | Pranam Kamlakhar | Akshaya Praveen| Telugu Christian Songs 2026

నీ చేతి కార్యము


నీ చేతి కార్యము - నాలోన జరిగించు
నీ దివ్య చిత్తము - నాలోన నెరవేర్చు (2)
నీ సన్నిధానము - నిత్యము కనపరచు
నీ వాగ్దానము - నాలోన స్థిరపరచు
యేసయ్య యేసయ్య - నా బలం నీవయా
ఏ భయం లేదయా - నీ కృప చాలయా



1. నీ దుడ్డు కర్రయు - నీ దివ్య హస్తము
నన్నాదరించును - నన్ను నడిపించును - (2)
నా మంచి కాపరీ - నీ కరుణ కాంతితో
నా జీవితాంతము - వెలిగించుము యేసయ్య యేసయ్య - నా బలం నీవయా
ఏ భయం లేదయా - నీ కృప చాలయా

2. నా శత్రు సైన్యమే - నను చుట్టుముట్టినా
నీ జాలి హృదయమే - నన్ను విడిపించును
కన్నీటి ప్రార్ధనే - నాకున్న ఆయుధం
నా జయము నీవనీ - స్తుతియింతును యేసయ్య యేసయ్య - నా బలం నీవయా
ఏ భయం లేదయా - నీ కృప చాలయా


3. ఉన్నత శిఖరముకు - నన్ను నడిపించును
ఎత్తైన స్థలములపై - నన్ను నిలబెట్టును
నా తోడు నీడగా - నీ వాక్య ధ్యానమే
నా బ్రతుకు బాటను - సరిచేయును యేసయ్య యేసయ్య - నా బలం నీవయా
ఏ భయం లేదయా - నీ కృప చాలయా

Yedaina Aadhaaram Neevega Song Lyrics | 2026 New Telugu Christian Worship Song | Ps. Johnson Clinton | UCH

ఏదైనా ఆధారం నీవేగా



ఏదైనా ఏమైనా ఆధారం నీవేగా
ఏ స్థలమో ఏ క్షణమో ఆధారం నీవేగా (2)
(Chorus)
ఆల్ఫాయు నీవే స్తోత్రములు
ఓమెగాయు నీవే స్తోత్రములు

ఆదియు నీవే స్తోత్రములు
అంతము నీవే స్తోత్రములు….. (2)



Verse 1
పౌలు సీలలు కృంగిన వేళలో,

ఆధారము నీవైతివిచెరసాలలో

దానియేలు ఉండగా, ఆధారము నీవైతివి (2)
నాకున్న పరిస్థితిలో విడుదలకోసమై,నా ఆధారం నీవేగా (2) (Chorus)


verse 2
సంసోనుకు బలము ఆధారమైయున్నావు

సౌలు విజయముకు ఆధారమైయున్నావు(2)
గర్వము అణిచీ గెలుపునిచ్చావు ,నా దీనస్థితిని వెలిగించుమో ప్రభూ!(2)