యేసయ్య నా ప్రాణమా
పల్లవి: యేసయ్య నా ప్రాణమా
ఘనమైన స్తుతిగానమా -2
అద్భుతమైన నీ ఆదరణే - ఆశ్రయమైన
నీ సంరక్షణయే నను నీడగ వెంటాడెను -
నే అలయక నడిపించెను నా జీవమా -
నా స్తోత్రమా - నీకే ఆరాధన నా స్నేహము
- సంక్షేమము - నీవే ఆరాద్యుడా
1 : చిరకాలము నాతో ఉంటానని -
క్షణమైనా వీడిపోలేదని
నీలో ననుచేర్చుకున్నావని -
తండ్రితో ఏకమై ఉన్నామని
ఆనందగానము నే పాడనా -2
ఏదైనా నాకున్న సంతోషము
నీతోనే కలిగున్న అనుబంధమే -2
సృజనాత్మకమైన నీకృప చాలు-
నే బ్రతికున్నది నీకోసమే -2 ||యేసయ్య||
2 : జీవజలముగా నిలిచావని- జలనిధిగా నాలో
ఉన్నావని జనులకు దీవెనగామార్చావని జగతిలో
సాక్షిగాఉంచావని ఉత్సాహగానము నే పాడనా -2
ఏదైనా నీకొరకు చేసేందుకు -
ఇచ్చితివి బలమైన నీశక్తిని -2
ఇదియేచాలును నా జీవితాంతము -
ఇల నాకన్నియు నీవేకదా -2
|| యేసయ్య ॥
3 : మధురముకాదా నీనామధ్యానం మరుపురానిది
నీ ప్రేమమధురం మేలుచేయూచు
ననునడుపువైనం - క్షేమముగా
నా ఈ లోకపయనం స్తోత్రగీతముగా నేపాడనా -2
నిజమైన అనురాగం చూపావయ్యా -
స్థిరమైన అనుబంధం నీదేనయ్యా -2
స్తుతుల సింహాసనం నీకొరకేగా-
ఆసీనుడవై ననుపాలించవా -2
|| యేసయ్య||
No comments:
Write CommentsSuggest your Song in the Comment.