స్తుతికి పాత్రుడా
పల్లవి:- స్తుతికి పాత్రుడా
నా హృదయాన కొలువైన - స్తోత్రార్హూడా (2)
1. అలసిపోతిని - జీవిత పయనంలో 
బలపరచితివి - జీవాహారముతో (2)
లెమ్ము బహుదూర - ప్రయాణముందని 
నీ ఆత్మ శక్తితో - నడిపించుచుంటివి (2) 
యేసయ్యా - యేసయ్యా 
కృతజ్ఞతా స్తుతులు 
                         ||స్తుతికి పాత్రుడా||      
2. కృపగల దేవా - కలువరి నాధా 
నీలా ప్రేమించి - క్షమించువారెవరు (2)
నీవే నా యెడల - కృప చూపకపోతే 
నేనీ స్థితిలో - ఉండేవాడనా (2)
 
యేసయ్యా - యేసయ్యా 
కృతజ్ఞతా స్తుతులు
 
                  ||స్తుతికి పాత్రుడా||             
3. సరిచేసితివి - నా జీవితమును
 
పలికించితివి - జీవన రాగాలు (2) 
నిన్నే నా మదిలో - నిలుపుకొంటిని
సీయోనులోనుండి - ఆశీర్వదించుము (2) 
యేసయ్యా - యేసయ్యా 
కృతజ్ఞతా స్తుతులు 
  ||స్తుతికి పాత్రుడా||             


No comments:
Write CommentsSuggest your Song in the Comment.