యూదుల రాజు
యూదుల రాజు జన్మించే నేడు
ఈ జగమంతా సంబరమే చూడు
కన్యా మరియా గర్భమునందు
నా ప్రియ యేసు జన్మించినాడూ
బెత్లెహేము పురములో రాజుల రాజు
ఉదయించినాడు మన కొరకే నేడు
గంతులు వేసి నాత్యమాడేదం
యేసుని చూచి ఆనందించేదం
1. తారను వెంబడించి వచ్చితిరి
గొల్లలు జ్ఞానులు ఉల్లసించిరి
వచ్చినాడు రక్షకుడు లోకానికి
మానవుల పాపలు మోయటానికి
గంతులు వేసి నాత్యమాడేదం
యేసుని చూచి ఆనందించేదం
2. మరణ ఛాయలో ఉన్నవారికి
నిత్య జీవము ఇవ్వటానికి
వచ్చినాడు రక్షకుడు లోకానికి పరలోకానికి చేర్చటానికి
గంతులు వేసి నాత్యమాడేదం
యేసుని చూచి ఆనందించేదం
No comments:
Write CommentsSuggest your Song in the Comment.