NAA YESUKAI JEEVINCHANA SONG LYRICS || NA ADUGULU STHIRAPARACHI SONG LYRICS
నా అడుగులు స్థిరపరచి - నా ఇడుములను తీర్చి
కడు ప్రేమను కనుపరచినా - నా యేసుని నే మరతునా 2
నే పాడనా కొనియాడనా - నా యేసుకై జీవించనా 2
పాపములోనే పుట్టిన నన్ను - పాపముతోనే పెరిగిన నన్ను 2
ప్రేమతో పిలిచి పాపము తుడిచి 2
పరమును చూపిన నా యేసుని 2
నే పాడనా
గొర్రెను పోలి నే తప్పితి దారి - కూలిపోతిని నా కాలు జారి 2
నా స్థితి చూచి నా దరి చేరి 2
నన్నాదరించిన నా యేసుని 2
నే పాడనా
ఎందుకు యేసయ్యా ఈ ప్రేమ నాపై - ఏమివ్వగలనయ్య నీ త్యాగముకై 2
ఊహించలేను వర్ణించలేను 2
ఊహకందని నీ ప్రేమను 2
నే పాడనా
Follow, Like and Share
Telegram Channel: Click Here
Facebook Page: Click Here
For More Songs Click Here

