Halaman

Pages - Menu

Pages

Sunday, March 28, 2021

Neeve Hrudaya Saradhi Song Lyrics ॥ నీవే హృదయ సారధి Song Lyrics ॥ Hosanna Ministries New Song Lyrics || Pas.JOHN WESLEY

 Neeve Hrudaya Saradhi Song Lyrics -

- నీవే హృదయ సారధి Song Lyrics -

 Hosanna Ministries New Song Lyrics -

Pas.JOHN WESLEY

 

 
 
నీవే హృదయ సారధి - ప్రగతికి వారధి  
 
నీ స్నేహమే సౌభాగ్యము - సంక్షేమ సంతకం  
 
నా పాటకే సౌందర్యము - నీవే యేసయ్యా
 
 
 
1. మదిలో చేదుజ్ఞాపకాల విలయ వేదిక కూల్చి  "2"
 
చిగురాశల దిశగా నను పయనింపజేసినా 
 
 నీ మాటలు స్థిరపరచెను విశ్వాస ప్రేమలో 
 
 కలనైనా అనుకోని అనురాగ బంధమైతివే 
 
 " నీవే హృదయ "
 
 
 
2. నీవు లేని జీవితం ప్రళయసాగరమే  "2"
 
దిక్కుతోచని సమయములో నీవేదిక్సూచివై  
 
చుక్కానిగ నడిపించుము ఆత్మీయ యాత్రలో 
 
 కనుపాపగ నను కాచిన నామంచి కాపరి 
 
 " నీవే హృదయ " 
 
 
 
3.చేరనైతి కోరనైతి స్నేహ సౌధము  "2"
 
చిరుదివ్వెగ దరిచేరి చేర్చావు సన్నిధి  
 
చావైనా బ్రతుకైనా నీకోసమే ప్రభు  
 
చాటింతు నీ ప్రేమను ప్రణుతింతు ప్రేమ సాగరా 
 
 " నీవే హృదయ "  
 
 
 
నీవే హృదయ సారధి - ప్రగతికి వారధి  
 
నీ స్నేహమే సౌభాగ్యము - సంక్షేమ సంతకం  
 
నా పాటకే సౌందర్యము - నీవే యేసయ్యా
 



Evaro nannila Telugu Song Lyrics॥ ఎవరో నన్నిలా Song Lyrics ॥ Hosanna Ministries 2021 New Song Song Lyrics

Evaro nannila Telugu Song Lyrics॥ 

 ఎవరో నన్నిలా Song Lyrics ॥

 Hosanna Ministries 2021 New Song Song Lyrics

 

 
 
ఎవరో నాన్నిలా మార్చినది - ఎడబాయని కృప చూపినది ౹౹2౹౹ 
 
 ఎవరు చూపని అనురాగమును - ఏదో తెలియని ఆప్యాయతను - చూపించినది ఇంకెవ్వరు  
 
ఇదే కదా ప్రేమ - యేసయ్యా ప్రేమ మధురమైన ప్రేమ - దివ్యమైన ప్రేమ ౹౹2౹౹  
 
ఎవరో నాన్నిలా మార్చినది - ఎడబాయని కృప చూపినది ౹౹2౹౹
 
 
 
 
1. దేహమే దేవుని ఆలయమేనని - దేవుని ఆత్మకు నిలయము నేనని ౹౹2౹౹  
 
మలినము కడిగి ఆత్మతో నింపి - నను ముద్రించి
 
 శుద్ధహృదయము కలిగించినది రాకడ కొరకే 
 
  " ఇదే కదా ప్రేమ " ౹౹ 2 ౹౹  
 
ఎవరో నాన్నిలా మార్చినది - ఎడబాయని కృప చూపినది ౹౹2౹౹
 
 
 
 
2. మార్గము తెలియక మౌనము వీడక - వేదన కలిగిన నను విడనాడక ౹౹2౹౹ 
 
 ప్రేమతో చేరి గమ్యము చూపి - ఒంటరి చేయక 
 
జంటగా నిలచీ - వేదన బాధలు తొలగించినది  
 
" ఇదే కదా ప్రేమ " ౹౹ 2 ౹౹ 
 
ఎవరో నాన్నిలా మార్చినది  ౹౹2౹౹ 
 
 
 
 
3. చీకటి కమ్మిన చెలిమే వాకిట - చెదరిన మనస్సుతో ఒంటరినై ౹౹2౹౹  
 
సత్యము నమ్మక మమతలు వీడి - ఎన్నడు ప్రభుని 
 
స్వరమును వినకా - శిలగా మారిన నను మార్చినది 
 
  " ఇదే కదా ప్రేమ " ౹౹ 2 ౹౹ 
 
ఎవరో నన్నిలా మార్చినది ౹౹2౹౹ 

Telugu Christian Song Lyrics || Prema kaligi Lyrics || ప్రేమ కలిగి Song Lyrics || Sharon sisters || JK Christopher || Philip Gariki || ASHATHEERA - 2021

 Telugu Christian Song Lyrics || 

 Prema kaligi Lyrics || ప్రేమ కలిగి Song Lyrics || 

  Sharon sisters || JK Christopher || Philip Gariki || 

ASHATHEERA - 2021

 

 
 
ప్రేమ కలిగి సత్యము పలుకుచు 
 
 క్రీస్తువలె సాగుదమా  
  || అందరితోను ప్రతీ విషయములో  
 
క్రీస్తువలె మెలగెదమా-“2”
 
  హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హలెలూయ "2"
 
 
 
1. క్రీస్తే వెలుగు-క్రీస్తే ప్రేమ-క్రీస్తే జగతికి మూలం 
 
        క్రీస్తే మార్గం-సత్యం-జీవం-క్రీస్తే మనకాధారం    “2" 
 
       క్రీస్తు యేసుతో నడచుచూ క్రీస్తు ప్రేమను చాటెదమా    “2” 
 
 క్రీస్తు ప్రేమను చాటెదమా
 
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హలెలూయ "2" 
 
 
 
2. శిరస్సై క్రీస్తు-సంఘము నడుపా-సంఘ క్షేమము సాధ్యం 
 
 సంఘమునందు అవయవములై-సహకరించుచు సాగెదం “2” 
 
 సార్వత్రికా సంగముగా సత్య సువార్తను చాటెదమా “2”  
 
సత్య సువార్తను చాటెదమా 
 
 
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హలెలూయ "2" 
 
 
 
ప్రేమ కలిగి సత్యము పలుకుచు 
 
 క్రీస్తువలె సాగుదమా  
 
అందరితోను ప్రతీ విషయములో  
 
క్రీస్తువలె మెలగెదమా-“2”
 
  హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హలెలూయ "2"
  

Thursday, March 25, 2021

AADHARAM NEEVE YESAYYA Telugu Song Lyrics || Dr SP BALU Songs || JK Christopher || Moses Undru Latest Telugu Christian Songs Lyrics 2019

AADHARAM NEEVE YESAYYA 

Dr SP BALU, JK Christopher, 

Moses Undru 

Latest Telugu Christian Songs 2019

 
 
 
 
 
పల్లవి:- ఆధారం నీవే యేసయ్యా
 
       ఆనందం నీవే మెస్సయ్యా   "2"  
 
నా తల్లియూ నీవే నా తండ్రి యు నీవే  
 
నాకున్నది నీవే నేనున్నది నీకే 
 
 ఆధారం ... నా ఆనందం నా కభయం 
 
దేవా ప్రతి దినం "2" ఆధారం"
 
 
 1. బంధువు లే నన్ను బాధ పరచిన
 
ఆత్మీయులే నన్ను ఆధరించకపోయినా. "2"  
 
కన్నుల్లో కన్నీరు కదులుతూనే వున్న  
 
హృదయం లో కలహాలు కుదురులేక చేస్తున్న"2" 
 
ఆధారం"  
 
 
 
  2. అశాంతి నాలో నిలువునా అలుము కుంటున్నా  
 
ఎవరున్నారు నీకని హృదయం ప్రశ్నిస్తున్నా  "2"
 
 భవిష్యత్తే నాలో భయమే రేపుతున్న 
 
 బరువైన హృదయం తో నీకై బ్రతుకుతున్న "2" 
 
ఆధారం" ఆధారం నీవే యేసయ్యా 

Yehova Naa Balama Song Telugu Lyrics || యెహోవా నా బలమా Telugu Song Lyrics || Telugu old christian song Lyrics

Yehova Naa Balama 

Song Telugu Lyrics ||

 యెహోవా నా బలమా 

Telugu Song Lyrics || 

Telugu old christian song Lyrics

 

 
 
 
యెహోవా - నా బలమా  
 
యధార్థమైనది నీ మార్గం
 
పరిపూర్ణమైనది  నీమార్గం
 
 
 
1. నా శత్రువులు నను చుట్టినను
 
నరకపు పాశము లరికట్టినను
 
వరదవలె భక్తిహీనులు పొర్లిన
 
                                                     విడువక నను ఎడబాయనిదేవా   ||యెహోవా - నా బలమా  ||
 
 
2. దయగల వారిపై దయచూపించును
 
కఠినుల యెడలను వికటము చూపును
 
గర్విష్టుల యొక్క గర్వము నణచును
 
                                                  సర్వము నెరిగిన సర్వాధికారి    ||యెహోవా - నా బలమా  || 
 
 
 
3. మరణపు టురులలో మరువక మొరలిడ
 
ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై
 
తన యాలయములో నా మొర వినెను
 
                                         అదరెను ధరణి భయకంపముచే ||యెహోవా - నా బలమా  || 
 
 
 
4. పౌరుషము గల ప్రభు కోపింపగ
 
పర్వతముల పునాదులువణకెను
 
తన నోట నుండి వచ్చిన యగ్ని
 
                                                   దహించి వేసెను వైరులనెల్ల     ||యెహోవా - నా బలమా  || 
 
 
 
5. మేఘములపై ఆయన వచ్చును  
 
మేఘములను తన మాటుగ జేయును
 
ఉరుములు మెరుపులు మెండుగజేసి
 
                                              అపజయమిచ్చును అపవాదికిని ||యెహోవా - నా బలమా  || 
 
 
 
6. నా దీపమును వెలిగించువాడు
 
నా చీకటిని వెలుగగ  జేయును
 
జలరాసులనుండి బలమైన చేతితో
 
                                              వెలుపల జేర్చిన  బలమైన దేవుడు ||యెహోవా - నా బలమా  ||  
 
 
 
7. నా కాళ్ళను లేడి కాళ్ళగజేసి
 
ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి
 
రక్షణ కేడెము నాకందించి
 
                                                  అక్షయముగ తన పక్షము జేర్చిన ||యెహోవా - నా బలమా  ||  
 
 
 
8. యెహోవా జీవముగల దేవా
 
బహుగా స్తుతులకు అర్హుడవీవె
 
అన్య జనులలో ధన్యత జూపుచు
 
                                                    హల్లెలూయ స్తుతి గానము చేసెద   ||యెహోవా - నా బలమా  ||

DEVUNI STUTIYINCHUDI Song Lyrics || దేవుని స్తుతియించుడి యెల్లప్పుడు Song Lyrics ||CHRISTIAN TELUGU FULL HD SONG WITH LYRICS

 DEVUNI STUTIYINCHUDI Song Lyrics ||

దేవుని స్తుతియించుడి యెల్లప్పుడు Song

 Lyrics ||CHRISTIAN TELUGU FULL HD 

SONG WITH LYRICS

 
 

 
 
దేవుని స్తుతియించుడి యెల్లప్పుడు – దేవుని స్తుతియించుడి ఆ .. ఆ .. 
 
 
 
1. ఆయన పరిశుద్ధ ఆలయమందు – ఆయన సన్నిధిలో 
 
ఆ… ఆయన సన్నిధిలో యెల్లప్పుడు  
 
 
2. ఆయన బలమును ప్రసిద్ధి చేయు – ఆకశ విశాలమందు 
 
ఆ… ఆ… ఆకాశ విశాలమందు యెల్లప్పుడు  
 
 
3. ఆయన పరాక్రమ కార్యముల్ బట్టి – ఆయన ప్రభావమును 
 
ఆ… ఆ… ఆయన ప్రభావమును యెల్లప్పుడు 
 
 
4. బూర ధ్వనితో ఆయనన్ స్తుతించుడి – స్వరమండలములతో 
 
ఆ.. ఆ.. స్వరమండలములతో యెల్లప్పుడు
 
 
5. సంనతంత్రుల సితార తోను – చక్కని స్వరములతో 
 
ఆ….. చక్కని స్వరములతో యెల్లప్పుడు  
 
 
6. తంబురతోను నాట్యముతోను – తంతి వాద్యములతో 
 
ఆ…. తంతి వాద్యములతో యెల్లప్పుడు 
 
 
7. పిల్లనగ్రోవులు చల్లగనూది – యెల్ల ప్రజలు చేరి 
 
ఆ…యెల్ల ప్రజలు చేరి యెల్లప్పుడు  
 
 
8. మ్రోగు తాళములతో ఆయనన్ స్తుతించుడి – గంభీర తాళముతో 
 
ఆ… గంభీర తాళముతో యెల్లప్పుడు  
 
 
9. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి – హల్లెలుయా ఆమెన్ 
 
ఆ…. హల్లెలుయా ఆమెన్ యెల్లప్పుడు 

Sthotram Chellinthumu Song Telugu Lyrics || స్తోత్రం చెల్లింతుము Song Telugu Lyrics | Dr Jayapaul | Telugu Christian Song

Sthotram Chellinthumu Song

 Telugu Lyrics

స్తోత్రం చెల్లింతుము |

 Dr Jayapaul | Telugu Christian Song




స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము  

                      యేసు నాథుని మేలులు తలంచి          ||స్తోత్రం||

 

దివారాత్రములు కంటిపాపవలె కాచి (2)  

                    దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి (2)       ||స్తోత్రం||  

 

గాడాంధకారములో కన్నీటి లోయలలో (2)  

                   కృశించి పోనీయక కృపలతో బలపరచితివి (2)      ||స్తోత్రం||

 

సజీవ యాగముగా మా శరీరము సమర్పించి (2)  

                   సంపూర్ణ సిద్దినొంద శుద్ధాత్మను నొసగితివి (2)      ||స్తోత్రం||

 

సీయోను మార్గములో పలుశోధనలు రాగా (2)  

                 సాతాన్ని జయించుటకు విశ్వాసము నిచ్చితివి (2)     ||స్తోత్రం|| 

 

సిలువను మోసుకొని సువార్తను చేపట్టి (2)  

                     యేసుని వెంబడింప ఎంత భాగ్యము నిచ్చితివి (2)       ||స్తోత్రం||  

 

పాడెద హల్లెలూయా మరనాత హల్లెలూయా (2)  

                  సద పాడెద హల్లెలూయా ప్రభుయేసుకే హల్లెలూయా (2)      ||స్తోత్రం||