Pages - Menu

Pages

Monday, January 17, 2022

Viluveleni Na Jeevitham Song Lyrics | Telugu Christian Songs | Christ Alone Music | Vinod Kumar, Benjamin Johnson

 


విలువేలేని నా జీవితం – నీ చేతిలో పడగానే

అది ఎంతో విలువని నాకు చూపితివే

జీవమే లేని నాలో నీ – జీవమును నింపుటకు

నీ జీవితాన్నే ధారబోసితివే (2)


నీది శాశ్వత ప్రేమయా – నేను మరచిపోలేనయా

ఎన్ని యుగాలైనా మారదు

ఎండిన ప్రతి మోడును – మరలా చిగురించును

నా దేవునికి సమస్తము సాధ్యమే (2)



1. పాపములో పడిన నన్ను

శాపములో మునిగిన నన్ను

నీ ప్రేమతో లేపితివే

రోగమే నన్ను చుట్టుకొనియుండగా

రోదనతో ఒంటరినైయుండగా

నా కన్నీటిని తుడిచితివే (2) ||నీది||



2. పగలంతా మేఘ స్తంభమై

రాత్రంతా అగ్ని స్తంభమై

దినమంతయు రెక్కలతో కప్పితివే

స్నేహితులే నన్ను వదిలేసినా

బంధువులే భారమని తలచినా

నా కొరకే బలి అయితివే (2) ||నీది||




సాధ్యమే సాధ్యమే సాధ్యమే

నా యేసుకు సమస్తము

సాధ్యమే సాధ్యమే సాధ్యమే

నా ప్రియునికి సమస్తము (2)

ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును

నా దేవునికి సమస్తము సాధ్యమే (2) ||విలువేలేని||

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.