అపరాధిని యేసయ్యా
కృపజూపి బ్రోవుమయ్యా (2)
నెపమెంచకయె నీ కృపలో
నపరాధములను క్షమించు (2)
1.ఘోరంబుగా దూరితిని నేరంబులను జేసితిని (2)
కౄరుండనై గొట్టితిని ఘోరంపు పాపిని దేవా (2)
2.చిందితి రక్తము నాకై పొందిన దెబ్బల చేత (2)
అపనిందలు మోపితినయ్యో సందేహమేలనయ్యా (2)
3.శిక్షకు పాత్రుడనయ్యా రక్షణ దెచ్చితివయ్యా (2)
అక్షయ భాగ్యము నియ్య మోక్షంబుజూపితివయ్యా (2)
4.దాహంబు గొనగా చేదు చిరకను ద్రావ నిడితి (2)
ద్రోహుండనై జేసితిని దేహంబు గాయములను (2)
No comments:
Post a Comment
Suggest your Song in the Comment.