బహుసౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా
నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై
నా హృదయాన కొలువాయెనే
నను జీవింపజేసే నీ వాక్యమే
నాకిలలోన సంతోషమే
1.పరిశుద్ధతలో మహనీయుడవు
నీవంటి దేవుడు జగమున లేడు
నాలో నీరీక్షణ నీలో సంరక్షణ
నీకే నా హృదయార్పణ
|| బహుసౌందర్య ||
2. ఓటమి నీడలో క్షేమము లేక
వేదన కలిగిన వేళలయందు
నీవు చూపించిన నీ వాత్సల్యమే
నా హృదయాన నవజ్ఞాపిక
|| బహుసౌందర్య ||
3. ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు
చల్లని నీచూపే ఔషధమే
ప్రతి అరుణోదయం నీ ముఖదర్శనం
నాలో నింపెను ఉల్లాసమే.
|| బహుసౌందర్య ||
No comments:
Post a Comment
Suggest your Song in the Comment.