జీవప్రధాతవు నను రూపించిన శిల్పివి నీవే ప్రభు
జీవన యాత్రలో అండగ నిలిచే తండ్రివి నీవే ప్రభు
జగములనేలే మహిమాన్వితుడా నా యెడ నీ కృపను
జాలీ హృదయుడా నాపై చూపిన వీడని నీ ప్రేమను
ఏమని పాడెదనూ ఏమని పొగడెదను
1.శుభకరమైన తొలిప్రేమనునే
మరువక జీవింప కృప నీయ్యవా
కోవెలలో నీ కానుక నేనై
కోరికలో నీ వేడుక నీవై
జత కలసి నిలిచి జీవింపదలచి
కార్చితివి నీ రుధిరమే
నీ త్యాగఫలితం నీ ప్రేమమధురం
నా సొంతమే యేసయ్య
|| జీవప్రధాతవు ||
2.నేనేమైయున్న నీ కృప కాదా
నాతో నీ సన్నిధిని పంపవా
ప్రతికూలతలు శృతిమించినను
సంధ్యాకాంతులు నిదురించినను
తొలివెలుగు నీవై ఉదయించినాపై
నడిపించినది నీవయ్యా
నీ కృపకు నన్ను పాత్రునిగా చేసి
బలపరచిన యేసయ్యా
|| జీవప్రధాతవు ||
3.మహిమను ధరించిన
యోధులతో కలసి
దిగివచ్చెదవు నా కోసమే
వేల్పులలోన బహుఘనుడవు నీవు
విజయవిహారుల ఆరాధ్యుడవు
విజయోత్సవముతో ఆరాధించెను
అభిషక్తుడవు నీవని
ఏనాడూ పొందని ఆత్మాభిషేకముతో
నింపుము నా యేసయ్య
|| జీవప్రధాతవు ||
No comments:
Post a Comment
Suggest your Song in the Comment.