Pages - Menu

Pages

Monday, March 27, 2023

KALUVARILO NEE SILUVA SONG LYRICS ||Latest Telugu Christian Good Friday song ||JK Christopher||Priya Himesh||Daya

కలువరిలో నీ శిలువ త్యాగమే


కలువరిలో నీ శిలువ త్యాగమే

కరిగించెను నా పాప హృదయమే (2)

నీవు కార్చిన ఈ రుధిర ధారలే (2)

కలిగించెను పాపికి పరిహారమే (2)

ఓ మానవా ఇది మన కోసమే

ఈ గొప్ప, ప్రేమ బలియాగము (2)



1. మన దోషము కొరకై నలుగగొట్టబడెను

మన అతిక్రమ బాధలు శిలువపై మోసెను (2)

కొరడా దెబ్బలతో గాయపరచబడెను

ఆ గాయములె నిన్ను స్వస్థత పరచెను (2)

ఓ మానవా ఇది మన కోసమే ||కలువరిలో||



2. తలపైన ముళ్ళ ప్రక్కలో బల్లెము

చేతులలో మేకులు భరియించినావే (2)

వధకుతేబడిన గొర్రెపిల్లఓలే

మౌనముగా శిక్షను సహియించినావే (2)

ఓ మానవా ఇది మన కోసమే ||కలువరిలో||



3. ప్రతి పాపము కడుగును యేసుని రక్తమే

ప్రతి శాపము బాపును ఆ ప్రియుని రక్తమే (2)

నీకై మరణించి విమోచనను కలిగించిన

ఆ ప్రియుని చెంతకు నీవు చేరుమా (2)

ఓ మానవా ఇది మన కోసమే ||కలువరిలో||

No comments:

Post a Comment

Suggest your Song in the Comment.