Halaman

Pages - Menu

Pages

Friday, January 31, 2025

Ni Namamulone Swasthatha Song Lyrics || Latest Christian Songs || Jessy Paul Songs


నీ నామములోనే

మాకు స్వస్థత


నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది
నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది (2) నా ప్రాణము నా సర్వము నీవే

నా యేసయ్య యేసయ్యా యేసయ్యా
నా శక్తియు నా ఆశ్రయం నీవే నా యేసయ్యా

యేసయ్యా యేసయ్యా (2)


1. దానియేలు సింహపు బోనులో ప్రార్ధించగా దేవా
సింహపు నోళ్లను మూసివేసినావు (2) నా కష్టకాలమందు నే ప్రార్ధించగానే

నను విడిపించినా నా యేసయ్యా (2)
॥ నా ప్రాణము ॥

2. అబ్రహాము విశ్వాసంతో వేచియుండగా దేవా
మూయబడిన శారా గర్భమును తెరచితివి (2) విశ్వాసముతో నే ప్రార్ధించగానే
నా ఆశలన్నీయు తీర్చిన దేవుడవు (2)

॥ నా ప్రాణము ॥

Monday, January 27, 2025

YESU THO SNEHAM SONG LYRICS | Evan Mark Ronald | Telugu Christian Songs 2023 | Bharat Mandru

యేసుతో స్నేహం

యేసుతో స్నేహం నాకేంతో భాగ్యం..
యేసుతో జీవితం నాకొక వరం...||2||
యేసే నాలో ఉండడం నాకు అతిశయమే.....||2||
ఆహా హ హా హా.......||4||



1. మట్టినైనా నాకు సృష్టికర్తతో స్నేహమా||2||
పాపినైనా నాకు రక్షకునితో జీవితమా||2||
నమ్మలేక నా హృదయం సంతసించుచున్నది......
ఆహా హా హా హా ||4||


2. స్థితిలేని నాకు... పరమందునా స్థానమా..||2||
ద్రోహినైనా నాకు నిత్యజీవపు భాగ్యమా........||2||
నమ్మలేక నా హృదయమ్ పరవశించుచున్నది||2||
ఆహా హా హ హా........

Yevarikki Yevaru Song Lyrics | Telugu Christian Song 2025 | Evan Mark Ronald | Bharat Mandru

ఎవరికి ఎవరు


ల్లవి :ఎవరికి ఎవరు ఈ లోకములో
ఎంత వరకు మనకి ఈ బంధము..
ఎవరికి ఎవరు సొంతము....
ఎవరికి ఎవరు శాశ్వతము....?

అను పల్లవి :
మన జీవితం ఒక యాత్ర....
మన గమ్యమే ఆ యేసు....
మన జీవితం ఒక పరీక్ష....
అది గెలవడమే మన తపన.... || ఎవరికి ఎవరు ||2||

1.తల్లిదండ్రుల ప్రేమ ఈ లోకం ఉన్నంత వరకే...
అన్న దమ్ముల ప్రేమ అనురాగం ఉన్నంత వరకే..."2"
స్నేహితుల ప్రేమ,ప్రియురాలి ప్రేమ..
స్నేహితుల ప్రేమ,ప్రియుని ప్రేమ... "2"
నీ ధనం ఉన్నంత వరకే...
నీ ధనం ఉన్నంత వరకే..."2"
|| మన జీవితం ఒక యాత్ర ||

2.ఈ లోక శ్రమలు ఈ దేహం ఉన్నంత వరకే...
ఈ లోక శోధనలు క్రీస్తులో నిలిచేంత వరకే... "2"
యేసులో విశ్వాసం,యేసుకై నీరిక్షణ
కాదేన్నడు నీకు వ్యర్థం...
కాదేన్నాడు నీకు వ్యర్థం... "2"
|| మన జీవితం ఒక యాత్ర ||

Asamanudu Song Lyrics | chinnysavarapu Songs |Sudhakarrella| New Telugu Christian Song Lyrics

అసమానుడు


అసమానుడైనవాడు - అవమానపరచడునిన్ను
ఓటమిఎరుగనీ మన దేవుడు - ఒడిపోనివ్వడు నిన్ను
ఘనకార్యాలెన్నో నీకై చేసినవాడు -కష్టకాలమందు నీ చేయి విడచునా
అసాధ్యములెన్నో దాటించిన నాథుడు - శ్రమలో నిన్ను దాటిపోవునా
సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు
కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును


1.అగ్ని గుండాములో నెట్టివేసిన -

సింహాల నోటికి నిన్ను అప్పగించిన
శేత్రూవే నీ స్థితిచూసి అతిశేయ పడుచున్న
సింహాలే నీ ఎదుటే మ్రింగివేయ నిలిచిన
నాకే ఎలా శ్రమలంటూ కృంగిపోకుమ
తెరిచూడు ఏసుని అగ్నిలో నిలిచెను నీకై
శుత్రువు చేతికి నిను అప్పగించాడు

2.పరిస్థితులన్నీ చేజారిపోయిన -

ఎంతగానో శ్రేమపడిన ఫలితమే లేకున్నా
అనుకున్నవన్నీ దూరమైపోయిన -

మంచిరోజులొస్తాయనే నిరిక్షణే లేకున్నా
మరది తలరాతని దిగులుపడకుమా
మారానుమధురముగా మార్చానునీకై
మేలులతో నిను తృప్తిపరచును

3.ఒంటరి పోరాటమే విసుగురేపిన
పొందిన పిలుపే బారమైపోయిన
ఆత్మీయులందరు అవమానిస్తున్న
నమ్మదగినవారులేక నిరాశేతో నిలిచిన
పిలుపునే విడచి మరలిపోకుమా

Ninne Nammukunnanaya Song Lyrics || Chinni Savarapu || Gowtham Titus || Latest Telugu Christian Song #2025

నిన్నే నమ్ముకున్నానయ్యా


నిన్నే నమ్ముకున్నానయ్యా
నా చేయి పట్టి నడుపు నీవుంటే నాకు చాలు - నీ ప్రేమే నాకు చాలు

1. లోకాన్ని నే ప్రేమించాను. స్నేహితులను నే నమ్మాను
బంధువులే నా బలమైయున్న నావారే అని అనుకున్నాను
అందరు నన్ను వెలిగా చూసి అపహసించి హింసించిరి
నీ ఆలోచనే మరువలేదు నీ కృపయే నను విడువలేదు

2. ధీన స్థితిలో నేనున్నప్పుడు నా పక్షమై నీవు నిలిచావు
కన్నీటి గాధలో నేనున్నప్పుడు నీ వాశ్చల్యమతో నన్ను ఆదరించావు
సీయోనులో నుండి నీ జీవధారలు నాపై ప్రోక్షించి నన్ను దీవించావు
నీ పిలుపే నన్ను విడువలేదు నీ కృపయే నన్ను దాటిపోలేదు

Digulu Padaku Nesthama Song Lyrics| Yesu Neeku Thodaiyunnadu Song Lyrics | New Telugu Christian Song 2025 | Tinnu Thereesh


పల్లవి:
దిగులు పడకు నేస్తమా యేసు నీతో ఉన్నాడు
సందేహ పడకు ప్రాణమా
నీకు తోడు ఉంటాడు

అ. ప.
ఏదైనా ఏ క్షణమైనా
యేసునాథుని తలంచుమా!
ఏమైనా ఏ స్థితియైనా
ఆదరించును గ్రహించుమా!



1. ఆశే నిరాశై అలసియున్నావా?
కీడే నీ నీడై తడబడుచున్నావా?
ఏదైనా ఏ క్షణమైనా
                ` యేసునాథుని తలంచుమా!
ఏమైనా ఏ స్థితియైనా
ఆదరించును గ్రహించుమా!


2. ప్రేమే కరువై కలత చెందావా?
గమ్యం తెలియక పరుగెడుచున్నావా?
ఏదైనా ఏ క్షణమైనా
యేసునాథుని తలంచుమా!
ఏమైనా ఏ స్థితియైనా
ఆదరించును గ్రహించుమా!

Tuesday, January 21, 2025

Yemundira Song Lyrics ||Prashanth Penumaka| Sathya Prakash | Pati Prasad || Latest Christian Telugu Songs

ఏముందిరా ఈ లోకనా

ఏముందిరా ఈ లోకనా..? - ఏముందిరా ఈ జీవాన.. ?
ఒంటరిగానే వస్తివి.. - ఒంటరిగానే పోతావురా..
ఎంత కాలమున్నా.. - ఎన్ని రోజులున్నా..
ఈ లోకం నీదికాదురా - నీ స్థలమే వేరురా
|| ఏముందిరా ||



1. ఒక్క బ్రతుకురా - అది చిన్న బుడగరా
ఈ జీవిత యాత్రలో - నువ్వే పరదేశిరా
దేవుడే నిన్ను చేసేరా - ఈ భువికి పంపేరా
ఏది నీది కాదురా - నీదేది లేదురా
కులం మతం వద్దురా - మంచితనమే ముద్దురా
చిన్న పెద్ద లేదురా - ప్రేమనే చూపించారా
|| ఏముందిరా ||


2. నీ వారెందరున్నా - రారెవరు ఒక్కరైనా
పెట్టెలో పెట్టేస్తారు - మట్టితో కప్పేస్తారు
రారు ఎవరు నీ తోడు - మర్చిపోతారు నీ పేరు
నీ కట్టే చేరెను కాటికి - నీ ఆత్మ చేరేదెక్కడికి ?
తెలుసుకోర యేసుని - మార్చుకోర బ్రతుకుని
నీకోసమే ప్రాణమిచ్ఛే - పరమునకు దారి చూపే
క్రీస్తు కొరకు బ్రతుకరా - స్వర్గానికి చేరరా

|| ఏముందిరా ||

Kavula Kalamulo Ranidi Song Lyrics | Latest Christian Telugu Songs 2024 | SP Balasubrahmanyam Songs

కవుల కలములో రానిది


కవుల కలములో రానిది.. పాండిత్యంలో లేనిది..
జ్ఞానుల జ్ఞానానికి అందనిది నీ జీవిత చరిత్ర
మనిషి నీ చరిత్ర..మనిషి నీ చరిత్ర "కవుల"

1.సూర్య చంద్ర నక్షత్రములు నీ కొరకే కాదా..
సృష్టిలో నీకంటే గొప్పదేది ఉన్నదా..? "2"
నీవు దేవుని కుమారుడవు కులమతాల కతీతుడవు"2"
వెలుగించు మనోనేత్రము తొలగించుకో పాపము"2"

2.కప్పకంటే నీ జీవితము గొప్పదే కాదా..
కోతి నుండి నువు పుట్టావని తప్పు చెప్పలేదా..?"2"
నీ దేహం దేవాలయము దేవునికది మందిరము"2"
పాడు చేసుకుంటే దానిని తిరిగి కట్టలేము"2"

3.క్రీస్తు యేసు మరణించినది నికొరకే కాదా
పరమునకు మార్గము నేనని ప్రభువు చెప్పలేదా..?"2"
నమ్మితే యేసుక్రీస్తు ని ఉందువులే పరలోకంలో"2"
ఇదే నీకు రక్షణ దినము ఇది దేవుని సందేశము"2"

Monday, January 20, 2025

Maha Parisudhudu Okkade Song Lyrics | Official Song | Latest Telugu Christian Songs 2025

మహా పరిశుద్ధుడు ఒక్కడే


మహా పరిశుద్ధుడు ఎవరు?
మహా ప్రసిద్ధుడు ఎవరు? - 2
వేల్పులలో యేసు ఒక్కడే

పూజ్యులలో యేసు ఒక్కడే - 2
ఒక్కడే - ఒక్కడే - యేసు

పరిశుద్ధుడు - శుద్ధుడు - క్రీస్తు - ఆహా - 2


1)దయామయుడు యేసు ఒక్కడే
కృపామయుడు యేసు ఒక్కడే - 2
దయాదాక్షిణ్యపూర్ణుడు- దయతో మన్నించగలడు


2)సర్వోన్నతుడు యేసు ఒక్కడే

సత్యవంతుడు యేసు ఒక్కడే - 2
సకలము సృజించినాడు సర్వం వ్యాపించినాడు


3) (మనకై) ప్రాణం పెట్టింది - యేసు ఒక్కడే
గొప్ప రక్షణ ఇచ్చింది - యేసు ఒక్కడే - 2
శాపం తొలగించినాడు - ముక్తి మార్గం చూపించినాడు

Atheethamaina Anuragam Songs Lyrics #Hosanna#pentecostal #New Song 2025#chinnisavarapu #hosannaministries#ps Jebaraj

అతీతమైన అనురాగము


యేసు దేవా సీయోను రాజా స్తుతులకు అర్హుడవు
శుద్దుడవు పరిశుద్దుడవు నీవే యోగ్యుడవు - 2
విలువైనది నీ బంధము అతీతమైనది నీ అనురాగము
నీ ప్రేమ ఎన్నటికీ నన్ను మరిచిపోలేదు
నీ కృప ఎన్నటికీ నన్ను దాటిపోలేదు నీవే నా ప్రాణం - నీవే నా జీవం
నీవే నా గమ్యం - నీవే నా ఆధారం - 2


1. చెప్పలేని బాధలలో - మదనపడే

వేళలో మమతనే పంచావు
చింతలెన్ని చుట్టుముట్టున -

చెంతనే వుండి చెలిమినే మాకిచ్చావు - 2
చీకటి క్షణాలలో చిరు వెలుగువై నా వెంట నీవు వున్నావు
నీ చేతి నీడలలో నన్ను చెక్కుకున్నావయ్యా
శ్రేష్ఠమైన సహవాసం ఇచ్చావయ్యా
నీవే నా ప్రాణం - నీవే నా జీవం
నీవే నా గమ్యం - నీవే నా ఆధారం - 2


2. హృదయమంత వేదనతో -

కలవరమే చెందగా ధైర్యమునే నీవిచ్చావు
అడుగులే తడబడిన పరిస్థితులే

చేజారిన చేయూతనే అందించావు - 2
అలసిన ప్రతి క్షణం ఆదరణవై నెమ్మదినే మాకిచ్చావు
విడువను ఎడబాయనని నన్ను బలపరచావయ్యా
ఉన్నత ఉపదేశం ఇచ్చావయ్యా
నీవే నా ప్రాణం - నీవే నా జీవం
నీవే నా గమ్యం - నీవే నా ఆధారం - 2


3. నా అన్నవారే నిందలు

మోపగా స్నేహితులే కీడే చేయగా
మేలులెన్నో పొందినవారే అవమానించగా

న్యాయాధిపతివై ఘనత నీచ్చావు - 2
ఎనలేని నన్ను నీవు గొప్పచేయ మొదలు పెట్టావయ్యా
నే ఓడిన చోటనే నా పక్ష్యమై పితరుల

అభిషేకం ఇచ్చావయ్యా
నీవే నా ప్రాణం - నీవే నా జీవం
నీవే నా గమ్యం - నీవే నా ఆధారం -2

ONTARI NE KAANAYYA SONG LYRICS | DD Anand | Pranam Kamlakhar | Anwesshaa | Telugu Christian Song 2025

ఒంటరి నే కానయ్యా


ఒంటరి నే కానయ్యా - యేసయ్యా - ఒంటరి నే కానయ్యా
నీ దయ వుండగా - కృప తోడై నడువగా
దయ వుండగా-కృప తోడై నడువగా
హల్లెలూయా - స్తోత్రమూ - యేసయ్యా -

నీ నామమే ఆభయమూ


1: చీకటి నన్నూ తరిమిననూ -

కష్టాలు అలలై ముంచిననూ
భయపడదూ - నా హృదయం -

నీ బలమైన హస్తమే - ఆయుధమవగా
బలమైన హస్తమే – ఆశ్రయమవగా


2: ఓటమిలా కనిపించిననూ -

మాటలు అగ్నియై కాల్చిననూ
వెనుకకు పడదూ నా అడుగూ-

మార్గము నీవై పయనం సాగూ


3: ఆగని పరుగులా సాగిననూ - ఆపద గాలులై వీచిననూ
పడిపోలేదూ - నా జీవితం-

క్రీస్తే పునాదియై- మందిరమవగా
క్రీస్తే పునాదియై- ఆలయమవగా


4: ఎవ్వరు లేరని అనలేనుగా -

మహిమ మేఘమే – తోడవగా
మెల్లనీ - నీ స్వరమూ - నా ధైర్యమై -

సాక్షిగా వెడలుచుండగా

YESU MANA ANDHARI SONG LYRICS | Latest Song Lyrics 2025 | Ps.Philip & Sharon Sisters | Dr.JK Christopher

యేసు మన అందరి ప్రభువు


యేసు మన అందరి ప్రభువు

యేసు మన జీవిత వెలుగు

నమ్ము సోదరా! నేడే రక్షణ పొందగ రా!


"యేసయ్యే నిను ప్రేమిస్తున్నాడు

కన్నీళ్ళే నాట్యముగా చేస్తాడు

మనకోసం ఒక కానుక అయ్యాడు

పరలోకం స్వాస్థముగా ఇస్తాడు"


1. ఇరుకైన మార్గమే నువు వదిలివేసావు

మరి ఎంచుకున్నావు విశాల మార్గము

కరుణలేని ఈ లోకం -నిను అన్ని వైపుల ముంచును

తెలిసి తెలిసి పాపములో - పడవద్దు అన్ని వ్యర్ధం



2. ఘనమైన దేవుని బలమైన చేతిలో

విలువైన పాత్రగా నేనుంటాను

కోటి కిరణాల కాంతి - నా యేసు ప్రభువునే చూడ

నా జీవితాన్ని కదిలించే - ఆ కరుణమూర్తి త్యాగం

Buradhalo molichina kaluvaku Song Lyrics || Latest Telugu Christian Songs 2025

బురదలో మొలిచిన


బురదలో మొలిచిన కలువకు మలినమంటదు ఎప్పటికి

ఉప్పు నీటిలో చేపకు ఉప్పదనం రాదు ఎన్నటికీ(2)

పాపపు లోకంలో బ్రతికే ఈ మనిషికి

పాపమంటు కొనుట ఇది విడ్డురం || బురదలో ||



1. ఆశించకు సోదరా పాపపు లోకమిది ౼

లోకముతో స్నేహము వైరమే కదా(2)

ప్రేమగల యేసుడు తన ప్రాణము నియ్యగా(2)

నీ హృదయం దేవునికి ఇవ్వలేవ(2)

లోపాలను దిద్దుకునే వాక్యమే అద్దము

ఈ చీకటి లోకంలో దీపమే వాక్యము(2)



2. పాపపు పురములు సొదొమ గొమొఱ్ఱలు ౼

నీతిగా లోతు అందు బ్రతుకలేద(2)

చేయని నేరానికి పొరుగు దేశమందు (2)

యేసేపు శిక్షననుభవించలేద(2)

వారికి అంటని పాపం నీకెందుకు అంటుతుంది

వారికి వలె బ్రతికితే పరలోకం వస్తుంది(2)

Deva Gnanamunimmu Song Lyrics| Hemachandra Vedala | Latest Telugu Christian Song 2024 | Rajkumar Jeremy

దేవా జ్ఞానమునిమ్ము


దేవా జ్ఞానమునిమ్ము
తెలివి వివేకము నిమ్ము
ఆలోచనా బలమునిమ్ము
నీ యెడల భయభక్తులనిమ్ము


1. అంధకారము ఆవరించగా
నీ వెలుగులో నడిపించుము దేవా
అపవాది అణచివేయగా
నీ బలముతో నిలబెట్టుము దేవా

కొరతలలో సమృద్ధి నీవై
రోగములో స్వస్థత నీవై
బాధలలో ఓదార్పువై
నిత్యము నను నడిపించు యెహోవా


2. యవ్వన కాలమున కాడి మోయను
ఆలోచన చెప్పుము ఓ తండ్రి
మార్గము తప్పి నడచు వేళ
భయభక్తులు నేర్పుము ఓ తండ్రి

మార్గములో కాపరివై
బలహీనతలో సామర్థ్యమువై
యుద్ధములోన ఖడ్గము నీవై
కడవరకు నా తోడై ఉండుమా