ఏమని పాడను
ఏమని పాడను నేనేపాటివాడను
ఏమియ్యగలను నాధా (2)
ఏమిచ్చి నీ రుణము చెల్లించను
ఏ రీతిని రుణము నే తీర్చను (2)
యేసయ్య నా యేసయ్య
యేసయ్య నా యేసయ్య
1. కన్నీరు విడువకుండా నాదు కన్నులను
జారిపడకుండా నాదు పాదములన్ (2)
నా మనవి నాలకించి (2)
నన్ను తప్పించినావే నాకు చెవి యొగ్గినావి.
" యేసయ్య"
2. విసిగిపోకుండా నీ వెలుగు చూపితివే
అలసిపోకుండా నీ ఆత్మనింపితివే (2)
నా మనవి నాలకించి (2)
నన్ను నడిపించినావే
నాకు చెవియొగ్గినావే.
"యేసయ్య"
3. కృంగిపోకుండా నీ కృపను చల్లితివే
తప్పిపోకుండానా ముందు నడిచితివే (2)
నా మనవి నాలకించి (2)
నన్ను దరి చేర్చినావే
నాకు చెవి యొగ్గినావే
"యేసయ్య"
No comments:
Post a Comment
Suggest your Song in the Comment.