మహా దేవుడా
మహా దేవుడా మహోన్నతుడా
మహా ఘనుడా మా పరిశుద్ధుడా
యుగయుగములకు దేవుడవు
తరతరములకు నీవే మా ప్రభుడవు
స్తోత్రార్హుడా స్తుతి పాత్రుడా
స్తుతులందుకో నా యేసయ్యా
ఆరాధన నీకే యేసయ్యా
స్తుతి అర్పణ నీకే మెస్సయ్యా
యెహోవా ఈరే యెహోవా షమ్మా
యెహోవా షాలోమ్ యెహోవా రాఫా
1. ఆకాశం నీ సింహాసనం భూమి నీ పాద పీఠం
అడవి మృగములు ఆకాశపక్షులు
సముద్ర మత్స్యములు నీ నిర్మాణములు
మంటితో నరుని నిర్మించినావు
నీ పొలికతో సృజియించినావు
నీ స్వాస్థ్యమునే మాకిచ్చినావు
నీ వారసునిగా మము పిలిచినావు
|| యెహోవా ||
2. పరిశుద్ధుడు పరిశుద్ధుడని
సెరాపులు నిన్ను స్తుతియించగా
సర్వోన్నతమైన స్థలములలో
దేవునికి మహిమా ఘనత
పరలోకమే నీ మహిమతో నిండెను
భూ జనులకు సమాధానం కలిగెను
సైన్యములకు అధిపతి నీవు
సర్వ సృష్టికి పూజ్యుడ నీవు
|| యెహోవా ||
No comments:
Write CommentsSuggest your Song in the Comment.