నా ఆశలన్నీ తీర్చువాడా
నా ఆశలన్నీ తీర్చువాడా
నిన్నే నే నమ్మితినయ్య
నాకున్న ఆధారం నీవెనయ్య
నా క్షేమమంతయు నీలోనయ్య
ఏదైన నీ వల్లె జరుగునయ్య
1. ఊహించలేదు నేనెప్పుడు
నేనంటే నీకు ఇంత ప్రేమనీ
పగిలిపోయిన నా హృదయమును
నీ గాయాల చేతితో బాగుచేసావే
2. ఇక ఈ బ్రతుకు ఐపోయిందని
నిర్థారించిన వారు ఎందరో
విసిగిపోయిన నా ప్రాణమును
ప్రతి రోజు క్రొత్తగా బ్రతికించుచున్నావే
3. ఆశించితి నేను నీ చెలిమిని
కడవరకు నీతోనే బ్రతకాలని
మిగిలిపోయిన ఈ అధముడను
నీ సేవచేసే భాగ్యమిచ్చావే
No comments:
Write CommentsSuggest your Song in the Comment.