నీ గొప్ప విశ్వాసమే
అసాధ్యమైనది లేనే లేదు - అంతయు సాధ్యమే (2)
నీ నామములో అన్నీయు - సాధ్యమే సాధ్యమే
నీ మాటలో అన్నీయు సాధ్యమే సాద్యమే
లేని ఉన్నట్టుగానే పిలచినది నీ గొప్ప విశ్వాసమే (2)
1. అరచేయి అంత మేఘము చూపి - సౌభాగ మిచ్చావు దేశమంతా
అల్పమైన ఆరంభమును - గంభీముగా ముగించు దేవా
నీ ఆత్మలో అన్నీయు సాధ్యమే సాధ్యమే
నీ శక్తిలో అన్నీయు సాధ్యమే సాధ్యమే
నమ్మినవారికి అద్భుతమును చూపించే మహనీయుడా (2)
2. ప్రధానులతో అధికారులతో కూర్చుండబెట్టె గొప్ప దేవా
హెచ్చించువాడవు నీవేతండ్రి ఘనత మహిమ నీకేదేవా
నీ కృపలో అన్నీయు సాధ్యమే సాధ్యమే
నీ జ్ఞానములో అన్నియు సాధ్యమే సాధ్యమే
నీ యొద్ధకు వచ్చు వారికి ఫలము ఇచ్చువాడవు (2)
No comments:
Write CommentsSuggest your Song in the Comment.