Halaman

Pages - Menu

Pages

Wednesday, February 23, 2022

Vinarandi Naa Priyuni Song Lyrics || వినరండి నా ప్రియుని విశేషము Song Lyrics || Hosanna Ministries Songs Lyrics


వినరండి నా ప్రియుని
విశేషము

నా ప్రియుడు (వరుడు) సుందరుడు మహా ఘనుడు ||2||

నా ప్రియుని నీడలో చేరితిని

ప్రేమకు రూపము చూసితిని ||2||

ఆహ ఎంతో మనసంతా ఇక ఆనందమే

తనువంతా పులకించి మహదానందమే ||వినరండి||



1. మహిమతో నిండిన వీధులలో

బూరలు మ్రోగే ఆకాశ పందిరిలో ||2||

జతగా చేరెదను ఆ సన్నిధిలో

కురిసె చిరుజల్లై ప్రేమామృతము

నా ప్రియ యేసు నను చూసి దరి చేరునే

జతగా చేరెదను ఆ సన్నిధిలో

నా ప్రేమను ప్రియునికి తెలిపెదను

కన్నీరు తుడిచేది నా ప్రభువే ||వినరండి||



2. జగతికి రూపము లేనప్పుడు

కోరెను నన్ను తన కొరకు నా ప్రభువు ||2||

స్తుతినే వస్త్రముగా ధరించుకొని

కృపన్ జయధ్వనితో కీర్తించెదను

నా ప్రభు యేసు చెంతన చేరెదను

స్తుతినే వస్త్రముగా ధరించుకొని

నా ప్రభు యేసు చెంతన చేరెదను

యుగమొక క్షణముగ జీవింతును ||వినరండి||



3. తలపుల ప్రతి మలుపు గెలుపులతో

నిలిచె శుద్ధ హృదయాల వీరులతో ||2||

ఫలము ప్రతిఫలము నే పొందుకొని

ప్రియ యేసు రాజ్యములో నే నిలిచెదను

ఆ శుభవేళ నాకెంతో ఆనందమే

ఫలము ప్రతిఫలము నే పొందుకొని

ఆ శుభవేళ నాకెంతో ఆనందమే

నా ప్రియుని విడువను నేనెన్నడు ||వినరండి||


SONG NO : 252

ANANDAM NEELONEA Song Lyrics || Hosanna Ministries 30thalbum [Manoharuda- Song-7] || Pas.JOHN WESLEY anna Song1080pHD


ఆనందం నీలోనే – ఆధారం నీవేగా

ఆశ్రయం నీలోనే – నా యేసయ్యా – స్తోత్రార్హుడు

అర్హతేలేని నన్ను – ప్రేమించినావు

జీవింతు ఇలలో – నీ కోసమే – సాక్ష్యార్థమై ||ఆనందం||



1. పదే పదే నిన్నే చేరగా

ప్రతిక్షణం నీవే ధ్యాసగా (2)

కలవరాల కోటలో – కన్నీటి బాటలో (2)

కాపాడే కవచంగా – నన్ను ఆవరించిన

దివ్యక్షేత్రమా – స్తోత్రగీతమా ||ఆనందం||



2. నిరంతరం నీవే వెలుగని

నిత్యమైన స్వాస్థ్యం నీదని (2)

నీ సన్నిధి వీడక – సన్నుతించి పాడనా (2)

నీకొరకే ధ్వజమెత్తి నిన్న ప్రకటించనా

సత్యవాక్యమే – జీవవాక్యమే ||ఆనందం||



3. సర్వసత్యమే నా మార్గమై

సంఘక్షేమమే నా ప్రాణమై (2)

లోక మహిమ చూడక – నీ జాడలు వీడక (2)

నీతోనే నిలవాలి నిత్య సీయోనులో

ఈ దర్శనం – నా ఆశయం ||ఆనందం||


SONG NO : 253

Krupagala Deva Song Lyrics ॥ కృపగల దేవా Song Lyrics॥ Hosanna Ministries 2021 New Song Pas.Abraham


కృపగల దేవా దయగల రాజా 

చేరితి నిన్నే బహుఘనతేజ

నీ చరణములే నే కోరితిని

నీ వరములనే నే వేడితిని ||2||

సర్వాధికారి నీవే దేవా

నా సహకారి నీవే ప్రభువా

నా కోరికలే సఫలము చేసి

ఆలోచనలే నెరవేర్చితివి

అర్పించెదను నా సర్వమును నీకే దేవా

ఆరాధించి ఆనందించెద నీలో దేవా ||2||  ||కృపగల||



1. త్రోవను చూపే తారవు నీవే

గమ్యము చేర్చే సారధి నీవే ||2||

జీవనయాత్ర శుభప్రదమాయే

నా ప్రతి ప్రార్ధన పరిమళమాయే

నీ ఉదయకాంతిలో నను నడుపుము

నా హృదిని నీ శాంతితో నింపుము ||2||  ||కృపగల||



2. కృప చూపి నన్ను అభిషేకించి

వాగ్ధానములు నెరవేర్చినావే ||2||

బహు వింతగా నను ప్రేమించినావే 

బలమైన జనముగా నను మార్చినావే

నీ కీర్తి జగమంత వివరింతును

నీ దివ్య మహిమలను ప్రకటింతును ||2||  ||కృపగల||



3. నా యేసురాజా వరుడైన దేవా

మేఘాల మీద దిగివచ్చు వేళ ||2||

ఆకాశవీధిలో కమనీయ కాంతిలో

ప్రియమైన సంఘమై నిను చేరెదను

నిలిచెదను నీతోనే సీయోనులో

జీవింతు నీలోనే యుగయుగములు ||2||  ||కృపగల||


SONG NO : 251

Monday, February 21, 2022

Nenu Vellemargamu Song Lyrics || నేను వెళ్ళేమార్గము నాయేసుకే తెలియును Song Lyrics || Hosanna Songs Lyrics 2022



నేను వెళ్ళేమార్గము నాయేసుకే తెలియును (2)

శోదింప బడిన మీదట నేను సువర్ణమై మారెదను (2)

హల్లేలూయా. . .హల్లేలూయా. . .హల్లేలూయా. .ఆమేన్‌ (2)



1. కడలేని కడలి తీరము ఎడమాయె కడకు నా బ్రతుకున

గురిలేని తరుణాన వెరవగ నా దరినే నిలిచేవా నా ప్రభు



2. జలములలో బడి నే వెళ్లినా అవి నా మీద పారవు

అగ్నిలో నేను నడచినా జ్వాలలు నను కాల్చజాలవు



3. విశ్వాస నావ సాగుచు పయనించు సమయాన నా ప్రభు

సాతాను సుడిగాలి రేపగా నాయెదుటేనిలిచేవా నా ప్రభు

Vetagani Urilo Nundi Song Lyrics || వేటగాని ఉరిలో నుండి Song Lyrics || Telugu Christian song by Ps. Joshua Deeven | JGM




వేటగాని ఉరిలో నుండి

నా ప్రాణాన్ని రక్షించావు

బలమైన రెక్కల క్రింద

నాకాశ్రయమిచ్చావు (2)

లేనే లేదయ్యా వేరే ఆధారం

నా దుర్గమా నా శైలమా

లేనే లేదయ్యా వేరే ఆధారం

నా శృంగమా నా కేడెమా

ఆరాధన ఆరాధన – నా తండ్రి నీకే ఆరాధన

ఆరాధన ఆరాధన – నా యేసు నీకే ఆరాధన (2)



1. రాత్రి వేళ భయముకైననూ

పగటి వేళ బాణమైననూ

రోగము నన్నేమి చేయదు

నా గుడారము సమీపించదు (2) ||లేనే లేదయ్యా||



2. వేయిమంది పడిపోయినా

పదివేల మంది కూలిపోయినా

అపాయము రానే రాదు

నా గుడారము సమీపించదు (2) ||లేనే లేదయ్యా||



3. మానవులను కాపాడుటకు

నీ దూతలను ఏర్పరిచావు

రాయి తగలకుండా

ఎత్తి నన్ను పట్టుకున్నావు (2) ||లేనే లేదయ్యా||

AA bojana panktilo simonu Song Lyrics || ఆ భోజనాపంక్తి లో సీయోను ఇంటిలో అభిషేకం Song Lyrics ||


ఆ 
భోజనాపంక్తి లో సీయోను ఇంటిలో అభిషేకం

చేసింది అత్తరు తో యేసయ్యను కన్నీటితో  పాదాలను కడిగింది

తనకురులతో పాదాలు తుడిచింది ఆమె

సువాసనసువాసన ఇల్లంతా సువాసన

ఆరాధన దైవారాధన ఆత్మీయ ఆలపన



1.జుంటి తేనె దరాలకన్న మధురమైన నీ వాక్యం

ఆవాక్యమే నన్ను బ్రతికించెను

హల్లెలూయా హల్లెలూయా ఆరాధన హల్లెలూయా

ఆరాధన దైవారాధన ఆత్మీయ ఆలపన ||2||  ||ఆభోజన||



2. సింహపు నోళ్ళను మూయించినది నీ వాక్యం

దానియేలుకువిజయము నిచెను ఆపై నీ వాక్యం

హల్లెలూయా హల్లెలూయా ఆరాధన హల్లెలూయా

ఆరాధన దైవారాధన ఆత్మీయ ఆలపన||2||  ||ఆభోజన||



3. అహష్వరోషు మనసును మార్చినది నీ వాక్యం

ఎస్తేరుప్రార్థన కు విడుదల నిచ్చిన నీ వాక్యం

హల్లెలూయాహల్లెలూయాఆరాధనహల్లెలూయా

ఆరాధనదైవారాధనఆత్మీయఆలపన||2||  ||ఆభోజన||

Bayamu chendhaku bhakthuda Song Lyrics || భయము చెందకు Song Lyrics || Shalem Raju Songs Lyrics


భయము చెందకు భక్తుడా ఈ మాయలోక మహిమలు చూచినపుడు (2)

భయము చెందకు నీవు దిగులు చెందకు నీవు (2)

జీవంమిచ్చిన యెహోవా వున్నాడు ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసయ్య యున్నాడు (2)



1. బబులోను దేశమందున ఆ ముగ్గురు భక్తులు ఆ బొమ్మకు మొక్కనందున (2)

పట్టి బంధించే రాజు అగ్ని గుండంలో వేసే (2)

నాల్గవవాడిగ ఉండలేదా మన యేసురాజు నాల్గవవాడిగ ఉండలేదా (2)



2. చెరసాలలో వేసినా తమ దేహమంత గాయలతో నిండిన (2)

పాడి కీర్తించి పౌలు సీలల్ కొనియాడె (2)

భూకంపం కలగలేదా ఓ భక్తుడా భూకంపం కలగలేదా (2)



3. ఆస్తియంతా పోయినా తన దేహమంతా కుర్పులతో నిండిన (2)

అన్ని ఇచ్చిన తండ్రి అన్ని తీసుకు పోయే (2)

అని యోబు పల్కలేదా ఓ భక్తుడా అని యోబు పల్కలేదా అన్ని మరలా ఇవ్వాలేదా (2)

Karuna Sampannuda Deeruda Hosanna Song Lyrics || కరుణా సంపన్నుడా… Song Lyrics॥ Hosanna Ministries 2022 New Song Pas.JOHN WESLEY Anna



కరుణా సంపన్నుడా ధీరుడా సుకుమారుడా
 

నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించెద  ||2|| 
 
నాపైన ప్రేమ చూపించి నా కొరకు త్యాగమైతివే
 
నా యేసయ్యా సాత్వీకుడా
 
నీకోసమే నా జీవితం   ||కరుణా||



1. ఏ నాడు నను వీడని  -  నీ ప్రేమ సందేశము 

నా హృదయసీమలోనే  -  సందడిని చేసెను  ||2||

అణువణువును బలపరిచే  -  నీ జీవపువాక్యమే
 
ప్రతిక్షణము దరిచేరి  -  నన్నే తాకెను   ||2||

ఆ వాక్యమే ఆరోగ్యమై జీవింపజేసి నన్నే నడిపించెను   ||కరుణా||



                                                                       
2. ఈ వింత లోకంలో -  నీ చెంత చేరితిని 

ఎనలేని ప్రేమలోనే -  ఆదరణ పొందితిని  ||2||

నీ కృపలో నిలిపినది - నీ ప్రేమబంమే

అనుదినము మరందమే - నీ స్నేహబంధము  ||2||
 
ఆ ప్రేమలోనే కడవరకు నన్ను నడిపించుమా -  స్థిరపరచుమా  ||కరుణా||




3. నే వేచియున్నాను -  నీ మహిమ ప్రత్యక్షతకై 

నాకున్న ఈ నిరీక్షణే - సన్నిధిలో నిలిపినది  ||2||

నా కోసం నిర్మించే - సౌందర్యనగరములో
 
ప్రణమిల్లి చేసెదను -  నీ పాదాభివందనం ||2|| 

తేజోమయా  నీ శోభితం -  నే పొందెద కొనియాడెద  ||కరుణా||


                                           
                              

Tuesday, February 8, 2022

Emivvagalanayya Nee Premaku Song Lyrics || ఏమివ్వగలనయ్యా నీ ప్రేమకు Song Lyrics ||




ఏమివ్వగలనయ్యా నీ ప్రేమకు -

ఏమివ్వగలనయ్యా నిరుపేదను ||2||

నా కొరకు చేసిన త్యాగానికి - నా కొరకు చిందిన రక్తానికి ||2|| ||ఏమి||


1. విస్తార ధనమును నాకివ్వగా - నీవు నిరుపేదవైనావుగా ||2||
పరలోక గగానాన భువనాలనేలేటి రారాజువు నీవేగా ||2||
రారాజువు నీవేగా - రారాజువు నీవేగా ||2|| ||ఏమి||



2. నా పాపములకొరకు నా శాపములకొరకు బలియైన నా యేసయ్యా ||2||

ఇలలోన విలువైన ఘనమైన నీ ప్రేమ ప్రకటింతును నేనయ్యా ||2||

ప్రకటింతును నేనయ్యా - ప్రకటించెద యేసయ్యా ||ఏమి||

Na Vedhanalo Na Badhalo Song Lyrics || నా వేదనలో నా బాధలో Song Lyrics || Christian Songs Telugu 2019|| Joshua Gariki Songs




నా వేదనలో నా బాధలో- నే కృంగిన వేళలో నా తోడై యున్నావు ||2||

నన్ను నడిపించు నా యేసయ్య - నాకు తోడైయుండు నా ప్రభువా ||2||

నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా || నా వేదనలో ||



1. నా అన్నవారే నను మరిచారయ్యా - అయినవారే నన్ను అపహసించినారయ్యా

నా కన్నవారిని నే కోల్పోయినా - నా స్వంతజనులే నన్ను నిందించినా

కన్నీటిని తుడిచి కౌగలించినావూ - కృపచూపి నన్ను రక్షించినావు ||2 || ||నన్ను నడిపించు||

|| నా వేదనలో ||


2. ఇహలోక శ్రమలన్ని ఎన్నదగినవికావని - ప్రభునందు నా ప్రయాస వ్యర్థమే కాదని ||2||

నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తేనని - చావైతే నాకది ఎంతో మేలని ||2||

నా కన్నులెత్తి నేవైపుకే నీరీక్షనతో చూచుచున్నాను ||2||

నీ యందే నే బ్రతుకుచున్నాను || నా వేదనలో ||