అన్నివేళల నిన్ను
స్తుతియింతును
అన్నివేళల నిన్ను స్తుతియింతును
ఆత్మతో సత్యముతో ఆరాధింతును "2"
నా జీవన దాత
నా హృదయాభిలాష "2"
నిన్నే నిన్నే నె సేవించెదను
ఆత్మతో సత్యముతో ఆరాధింతును "2"
అన్నివేళల నిన్ను స్తుతియింతును
1. గుండెపగిలె వేదనలో కంట నీరు పొంగగా
కన్నీరే ప్రార్ధనగా ని సన్నిధి చేరగా "2"
నా కన్నీటిని నాట్యముగా మార్చిన దేవా
నీ కనుపాపగా నన్ను ఇల కాచిన ప్రభువా "2"
నీ కనుపాపగ నన్ను ఇల కాచిన ప్రభువా "2"
అన్నివేళల నిన్ను స్తుతియింతును
ఆత్మతో సత్యముతో ఆరాధింతును "2"
నా ఆత్మతో సత్యముతో ఆరాధింతును
2. ఇంటిమీద ఒంటరైన పిచ్చుకనై నుండగా
శోధనలో వేదనలో సొమ్మసిల్లుచుండగా "2"
నా సమస్యలను సాక్ష్యాలుగా మార్చవయ్యా
నా వేదనలను వేడుకగా మార్చవయ్యా "2"
నా వేదనలను వేడుకగా మార్చవయ్యా "2"
అన్నివేళల నిన్ను స్తుతియింతును
ఆత్మతో సత్యముతో ఆరాధింతును "2"
నా జీవన దాత
నా హృదయాభిలాష "2"
నిన్నే నిన్నే నె సేవించెదను
ఆత్మతో సత్యముతో ఆరాధింతును "2"
అన్నివేళల నిన్ను స్తుతియింతును
No comments:
Write CommentsSuggest your Song in the Comment.