మనసులోని మాటే
పల్లవి:- మనసులోని మాటే పెదవి దాటక
మునుపే ఎరిగిన వాడవు యేసయ్యా
గుండెలోని బాదే పొంగి పొరలుక మునుపే
నాట్యముగా మార్చితీవీ నా యేసయ్యా
ఊహించలేని మేలులతో నింపితివి
నీ రక్షణతో నన్ను అలంకరించితివి ||2||
యేసయ్య......నా యేసయ్య..||2||
1) నా కన్నీటిలో నన్ను విడువక
కరుణించి నావు నీవు నా యేసయ్య
నా బాధయందు నన్ను మరువక
ఓదార్చి నావు నీవు నా యేసయ్య
కృంగిన సమయములో కృపతో బలపరిచితిని
వేదనల వేళలో నా తోడై నిలచితివి ||2||
యేసయ్య......నా యేసయ్య.. ||2||
|| మనసులోని మాటే ||
2) విడువని బంధంతో మరువన త్యాగముతో
కలకాలము నిలిచే అనురాగముతో
మార్పులేని ప్రేమతో మరపురాని
జ్ఞాపికతో మదిలోన నిలిచావు నా యేసయ్య..
నిత్యమైన వాగ్దానంతో నన్ను
నీవుపిలచితిని నీకృప క్షేమముతో
నన్ను నీవు నింపుతివి...||2||
యేసయ్య....నా యేసయ్య....
|| మనసులోని మాటే ||
No comments:
Write CommentsSuggest your Song in the Comment.