ఉదయమున నీ కృపలను
ఉదయమున నీ కృపలను
ప్రతి రాత్రి నీ మేళ్లను
పదితంతుల స్వర మండలముతో
కీర్తించెద సితారతో " 2 "
స్తుతి ఆరాధన నీకే
స్తుతి మహిమ ఘనత నీకే " 2 "
1 ) నీకార్యము చేత నే సంతోషించెదను
నీక్రియలను బట్టి నిను ఆరాధించెదను
నా జీవిత కాలమంతా
స్తుతి గానము చేసెదను " 2 "
స్తుతి ఆరాధన నీకే
స్తుతి మహిమ ఘనత నీకే " 2 "
2 ) నీ మందిరములో నాటబడిన వాడనై
నీ ఆవరణములో నే వృద్ధి చెందెదను "2"
చిరకాలము నీ సన్నిధిలో
నివాసము నే చేసెదను " 2 "
స్తుతి ఆరాధన నీకే
స్తుతి మహిమ ఘనత నీకే " 2 "
3 ) నీ ఆత్మ చేత నింపబడిన దాననై
నీ వాక్యము చేత నే శుద్ధి నొందెదను " 2 "
నా జీవితకాలమంతా
నీలో ఫలియించెదను " 2 "
స్తుతి ఆరాధన నీకే
స్తుతి మహిమ ఘనత నీకే " 2 "
No comments:
Write CommentsSuggest your Song in the Comment.