యేసే నా పరిహారి – ప్రియ యేసే నా పరిహారి
Animation Movies
Subscribe to:
Post Comments (Atom)
I will post Latest Telugu Christian Songs in Telugu Language, Worship Songs, Hosanna Songs,video songs,John Wesly Songs,Lyrics for Hindi Christian songs.
యేసే నా పరిహారి – ప్రియ యేసే నా పరిహారినా జీవిత కాలమెల్లా – ప్రియ ప్రభువే నా పరిహారి (2)
ఎన్ని కష్టాలు కలిగినను – నన్ను కృంగించే భాదలెన్నో (2)
ఎన్ని నష్టాలు శోభిల్లినా – ప్రియ ప్రభువే నా పరిహారి (2)
యేసే సత్యం యేసే నిత్యం యేసే సర్వం జగతికి
యేసే జీవం యేసే గమ్యం యేసే గమనము
పాట పాడెదం ప్రభువునకు స్తోత్రార్పణ చేసేదం (2)
యేసే సత్యం యేసే నిత్యం యేసే సర్వం జగతికి
యేసే జీవం యేసే గమ్యం యేసే గమనము
పలురకాల మనుషులు పలువిధాల పలికినా
మాయలెన్నో చేసినా లీలలెన్నో చూపినా (2)
యేసులోనే నిత్యజీవం యేసులోనే రక్షణ (2)
యేసే సత్యం యేసే నిత్యం యేసే సర్వం జగతికి
యేసే జీవం యేసే గమ్యం యేసే గమనము
పరమ జీవము నాకు నివ్వ
తిరిగి లేచెను నాతో నుండ
నిరంతరము నన్ను నడిపించును
మరల వచ్చి యేసు కొని పోవును (2)
యేసు చాలును – హల్లెలూయ
యేసు చాలును – హల్లెలూయ
యే సమయమైన యే స్థితికైన
నా జీవితములో యేసు చాలును
నాశనకరమైన తెగులుకైనా
భయపడను నేను భయపడను (2)
యేసయ్య నామము నా ప్రాణ రక్ష
గొర్రెపిల్ల రక్తము నా ఇంటి సురక్ష (2)
శక్తి చేత కాదనేను – బలముతో ఇది కాదనేను (2)
నా ఆత్మ ద్వారా ఇది చేతునని యెహోవా సెలవిచ్చెను (2)
ఓ గొప్ప పర్వతమా
జెరుబ్బాబెలు నడ్డగింపను (2)
ఎంత మాత్రపు దానవు నీవనెను
చదును భూమిగా మారెదవు (2)
శక్తి చేత కాదనేను – బలముతో ఇది కాదనేను (2)
రండి ఉత్సాహించి పాడుదము
రక్షణ దుర్గము మన ప్రభువే
రండి కృతజ్ఞత స్తోత్రముతో
రారాజు సన్నిధికేగుదము
సత్ప్రభు నామము కీర్తనలన్
సంతోష గానము చేయుదము
రండి ఉత్సాహించి పాడుదము
రక్షణ దుర్గము మన ప్రభువే
మన ప్రభువే మహా దేవుండు
ఘన మహాత్యము గల రాజు (2)
భూమ్యాగాధపు లోయలును
భూధర శిఖరములాయనవే
రండి ఉత్సాహించి పాడుదము
రక్షణ దుర్గము మన ప్రభువే
హే ప్రభుయేసు హే ప్రభుయేసు హే ప్రభు దేవసుతా
సిల్వధరా – పాపహరా – శాంతికరా
హే ప్రభుయేసు హే ప్రభుయేసు
శాంతి సమాధానాధిపతీ – స్వాంతములో ప్రశాంతనిధీ (2)
శాంతి స్వరూపా జీవనదీపా – శాంతి సువార్తనిధీ
సిల్వధరా – పాపహరా – శాంతికరా
హే ప్రభుయేసు హే ప్రభుయేసు
పాపము పోవును – భయమును పోవును
పరమ సంతోషము – భక్తులకీయును
పరిమళ తైలము – యేసయ్య నామం
భువిలో సువాసన – యిచ్చెడి నామం (2)
యేసయ్య నామం – శక్తిగల నామం
సాటిలేని నామం – మధుర నామం (2)
నా ముందు సిలువ – నా ముందు సిలువ
నా వెనుక లోకాశల్ – నాదే దారి
నా మనస్సులో ప్రభు – నా మనస్సులో ప్రభువు
నా చుట్టు విరోధుల్ – నావారెవరు (2)
నా యేసుని మించిన మిత్రుల్ – నాకిలలో గానిపించరని (2)
నే యేసుని వెంబడింతునని
నేడేగా నిశ్చయించితిని
నే వెనుదిరుగన్ వెనుకాడన్
నేడేసుడు పిల్చిన సుదినం
సంతోషమే సమాధానమే (3)
చెప్ప నశక్యమైన సంతోషం (2)
నా హృదయము వింతగ మారెను (3)
నాలో యేసు వచ్చినందునా (2)
సంతోషమే సమాధానమే (3)
చెప్ప నశక్యమైన సంతోషం (2)
స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము (2)
యేసు నాథుని మేలులు తలంచి ||స్తోత్రం||
సిలువను మోసుకొని సువార్తను చేపట్టి (2)
యేసుని వెంబడింప ఎంత భాగ్యము నిచ్చితివి (2)
రాజాధి రాజులకన్నా రాజైన దేవుడని
నీచాతి నీచులను ప్రేమింప వచ్చేనని (2)
నిన్న నేడు ఏక రీతిగా ఉన్నాడని (2)
పూజించి… పూజించి పాటించి చాటించ రారే
హల్లేలూయా యని పాడి స్తుతింపను
రారే జనులారా మనసారా ఊరూరా
రారే జనులారా ఊరూరా నోరారా
పరమ దేవ నిబంధ నాజ్ఞల్ – భక్తితో గైకొను జనులకు (2)
నిరతమును గృప నిలిచి యుండును – యెహోవ నీతి
తరములు పిల్లలకు నుండును – ఆ కారణముచే
దేవ సంస్తుతి చేయవే మనసా
శ్రీ-మంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా
నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు
నా వ్యధలు భరించి నన్నాదుకొన్నావు
నన్ను నీలో చూచుకున్నావు
నను దాచియున్నావు (2)
హల్లెలూయ యేసయ్య – హల్లెలూయ యేసయ్య
ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా
అందుకో నా దీన స్తుతిపాత్ర హల్లెలూయ యేసయ్యా
మా దేవుడవై మాకిచ్చితివి
ఎంతో గొప్ప శుభ దినము
మేమందరము ఉత్సాహించి సంతోషించెదము (2)
కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని (2)
స్తుతియు మహిమ ఘనత నీకే
యుగయుగముల వరకు
ఎంతో నమ్మదగిన దేవా (2)
నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును యేసు
నిన్నే ప్రేమింతును – నే వెనుదిరుగా
నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా
నిరసించక సాగెదా నే వెనుదిరుగా (2)
నిన్నే కీర్తింతును నిన్నే కీర్తింతును యేసు
నిన్నే కీర్తింతును నే వెనుదిరుగా || నీ సన్నిధిలో ||
నీ ప్రేమ నీ శక్తిని
నింపుము నాలోనా(2)
ఆరాధింతునా - హృదయమంతటితో
ఆరాధింతునా-
మనసంతటితో
ఆరాధింతునా-
బలమంతటితో
యేసు నీవే... నా ప్రభు నీవే (2) ||నీ ప్రేమ||
No comments:
Write CommentsSuggest your Song in the Comment.