అలల కడలి
పల్లవి : అలల కడలి ఎగసిన
అలజడి సృష్టించిన
చీకటి కమ్మేసిన
హితము గతము మరచిన
నా మది క్షీణించిన
నీ చెయ్యి తోడయ్యనే
దేవా నా జీవం నా ప్రాణం నీవేలే
దేవా నా పయనం నా గమ్యం నీవేలే ||2||
1. సొంతవారే సనిగిన జగమే దూషించిన
మోసే చూసింది నిన్నేగదా
వెకిలి మాట చేత విలపించిన
యిర్మియా ప్రార్ధించినది నీకేగదా ||2||
ఇకను ఏమి చెప్పేదన్ నీవు తోడుంటే
రాజ్యములను జయించిరే
నీతిని జరిగించి వాగ్దానములు పొంది
సింహపు నోళ్లు మూసిరే ||2|| దేవా...
2. శరీరదారియైన దినములలోన
క్రీస్తుకు మిగిలింది కన్నీళ్లేగా
మహా రోదనతో మరణములోనూ
క్రీస్తు పిలిచింది నిన్నేగా ||2||
అగాధ జలములలోన నీవు
తోడుండి నన్ను తిరిగి లేపితే ||2||
హృదయపూర్వకముగా నీవు విచారము
దుఃఖము నాకు కలుగజేయవు...||2|| దేవా...


No comments:
Write CommentsSuggest your Song in the Comment.