నాకెన్నో మేలులు చేసితివే
నాకెన్నో మేలులు చేసితివే – నీకేమి చెల్లింతును
– దేవా నీకేమి అర్పింతును
హల్లెలూయా యేసునాథా – కృతజ్ఞతా స్తుతులివే
1. కృప చేత నన్ను రక్షించినావే –
కృప వెంబడి కృపతో – నను బలపరచితివే
నన్నెంతగానో ప్రేమించినావే –
నా పాపమును కడిగి – పరిశద్ధపరచితివే
2. నాకిక ఆశలు లేవనుకొనగా –
నా ఆశ నీవైతివే – ఆశలు తీర్చితివే
నలుదిశల నన్ను భయమావరింప –
నా పక్షమందుంటివే – నాకభయమిచ్చితివే
3. నా కాడి మోసి నా తోడు నీవే –
నీ చేతి నీడలో – నను దాచియున్నావే
ఏ కీడు నాకు రాకుండ చేసి –
నీ జాడలో నన్ను- నడిపించుచున్నావే
4. నీ రాజ్యమందు నను చేర్చుకొందువు –
రానున్న రారాజువు – నా రాజువు నీవు
నీ వధువు సంఘమున నను చేర్చుకొన్నావు-
నను కొన్నవాడవు-నా వరుడవు


No comments:
Write CommentsSuggest your Song in the Comment.