ఎల్ బేతేల్
ప్రభు నీదు సన్నిధిలో - సంపూర్ణ సంతోషం
పరవశమొందే నా మది నీ సన్నిధి చేరి (2)
ఎల్ బేతేల్ - ఎల్ బేతేల్
బేతేలు దేవుడే నా దేవుడు(2)
ఆరాధన ఆరాధన - ఆర్పజాలని ఆరాధన (2)
నీవిక్కడ ఉన్నావు - నన్ను దర్శించావు - నా దిశనే మార్చావు
కృతజ్ఞత బాష్పాలతో - తడిపెద నీ పాదాలను (2)
1) ఎడారిలో నే బాటసారిలా - వెంటాడే నే నాదు చేదు గతం
గురిలేని జీవిత వలయంలో - పోరాడి అలసి సోలితిని
జీవాలయంలో నను తాకి - సంవృద్ధి జీవముతో నింపితివి(2)
నా దేవుని మందిరముబులో
క్షణమైన నే విడచి బ్రతుక జాలను (2) ||ఎల్ బేతేలు||
2) ఇహలోక మహిమను వెంటాడుతూ అంతా చివరికి మోసమని
ఏదియు నాతోడు రాలేదని - ఏకాకిగా నేను మిగిలితిని
నీ తేజో మహిమను చూపావు - నాతో నిబంధన చేసావు(2)
నీవిచ్చిన మాటను నెరవేర్చు వరకు
విడువక ఎడబాయక ఉందునంటివి (2) ||ఎల్ బేతేలు||
3) సంపాదనే నాదు ధ్యేయమని - ఇహలోకమే నాకు సర్వమని
పరలోక గవి నే మరచి - పరమార్థాన్నే విడచితిని
అంతా భ్రాంతియేనని ఏదీ నాది కాదని (2)
నీవే నాదు సర్వమని - గ్రహించి నీ సన్నిధి చేరితిని (2) ||ఎల్ బేతేలు||


No comments:
Write CommentsSuggest your Song in the Comment.