జాలరి పండుగ
పల్లవి:
రాజువైన యేసయ్య - మమ్ము యేలేటి మా రాజా (2x)
మా చీకటి బ్రతుకుల్లో - వెలుగు నింపావు
మేము కోరేటి రేవునకు - చక్కంగ నడిపావు
అను పల్లవి:
కన్న వాటిని మరి విన్నవాటిని
చెప్పలేకుండా మారి మేము ఉండలేమయా (2x)
ఉన్నా వాడవు నీవే మాకు
అన్ని వేళల అండవు నీవేనయ్య (2x)
1. చేపలు పట్టే జాలరివి - చదువే రాని పామరుని
మనిషిని పట్టే జాలరిగ - చక్కంగ మలిచావు (2x)
నీ మార్గములోనికి నడిపేటి మాటలు నా నోట ఉంచావు
మహిమల రాజ్యము దారి చూపే మనసును నిమ్మలపరచావు (2x)
అను పల్లవి:
కన్న వాటిని మరి విన్నవాటిని
చెప్పలేకుండా మారి మేము ఉండలేమయా (2x)
ఉన్నా వాడవు నీవే మాకు
అన్ని వేళల అండవు నీవేనయ్య (2x)
2. చేప లేక చింత పడితిని - రాతిరంతా వలవేసితిని
లోతుగా వలలు వేయమని - చల్లంగ పలికావు (2x)
నా వలలు పగిలిపోయేటి - గొప్ప వేటనిచ్చావు
బ్రతికేటి దారి నాకు చూపి - చింతనంత తీసావు (2x)
అను పల్లవి:
కన్న వాటిని మరి విన్నవాటిని
చెప్పలేకుండా మారి మేము ఉండలేమాయ (2x)
ఉన్నా వాడవు నీవే మాకు
అన్ని వేళల అండవు నీవేనయ్య (2x)
3. అద్దరికి పోవ చూచితిని - దోనెను నేను ఎక్కితిని
త్రోవలో తుఫాను తాకిడికి - తల్లడిల్లి పోతిని (2x)
బూతమని భయపడితిని - నేనే భయపడకంటివి
దేవకుమార నీవే అని నిండుగా నిన్నే మ్రొక్కితిని (2x)
అను పల్లవి:
కన్న వాటిని మరి విన్నవాటిని
చెప్పలేకుండా మారి మేము ఉండలేమాయ (2x)
ఉన్నా వాడవు నీవే మాకు
అన్ని వేళల అండవు నీవేనయ్య (2x)
ఓ ఓ ఓ - ఓ ఓ ఓ
ఓ ఓ ఓ - ఓ ఓ ఓ


No comments:
Write CommentsSuggest your Song in the Comment.