నీ ప్రేమే నాతో పలికే
పల్లవి: నిన్ను ఎప్పుడు నే వీడిపోనని
చెయి పట్టి నే నడుపుతానని (2)
ఏ చోటున నీవుండిన.. నీ తోడుగా ఉంటానని
ఏ చోటను నీవుండిన.. నీ తోడుగా నేను
కోరస్:
నీ ప్రేమే నాతో పలికే ప్రతిదినం
నన్ను నడిపే ప్రతిక్షణం
నాతో నడిచే నీ ప్రేమే నీ ప్రేమే (2)
చరణం:
ఒంటరిని కాను నేనెన్నడూ
దాగియుండలేదు నీ కనులకు (2)
నిరాశ నిలిచినా.. ఎడారి దారినా
సెలయేరు పారగా సెలవిచ్చినావుగా
నా యేసు నీ కృప.. వెన్నంటే నిలిచినా
నీ మాట చాటున సంద్రాలు దాటనా


No comments:
Write CommentsSuggest your Song in the Comment.