మారుతుంది నీ జీవితము
మారుతుంది నీ జీవితము - వేదన చెందకుమా..!
మరచిపోడు నిను యేసయ్యా - మాటే నమ్ము సుమా! - 2
మోసే భారం - నువు చేసే త్యాగం - 2
ఎదురితలన్ని - ఎదకోతలన్ని
చూసేను నా దైవం - చేయునులే సాయం
చూసేను నా దైవం -చేయునులే న్యాయం
|| మారుతుంది ||
1. ఆలస్యం అయ్యిందని - ఆక్రందన చెందకు
రోజులు మారవని - రోధించకు - 2
ఆ రోదననే - ఆరాధనగా
మనుగడనే - మాధుర్యంగా -2
మలచును నా దైవం - విడువకు నీ ధైర్యం - 2
|| మారుతుంది ||
2. నీ కథ మారిందని - నిరాశలో ఉండకు
నీ వ్యధ తీరదని - చింతించకు -2
నీ చింతలనే - చిరునవ్వులుగా
యాతననే స్తుతి కీర్తనగా - 2
మార్చను నా దైవం - వీడకు విశ్వాసం - 2
|| మారుతుంది ||


No comments:
Write CommentsSuggest your Song in the Comment.