ప్రార్ధనతోనే భవిష్యత్తున్నదీ
ప్రార్ధించలేనిది ఏమున్నది
ప్రార్ధనకు బదులు ఏమున్నది//2//
ప్రార్ధనతోనే భవిష్యత్తున్నదీ
ప్రార్ధనలోనే ప్రతిఫలమున్నదీ //2//
ప్రభువా ప్రభువా క్షమించుము మాపాపాన్ని
దేవా దేవా దయచూపుము మాదేశాన్ని
ప్రభువా ప్రభువా క్షమించుము మాపాపాన్ని
దేవా దేవా దహించకు మా దేశాన్ని //2//
1) బలిపీఠములు కట్టాలి - బలవంతుని బంధించాలి
బలహీనులకై ఏడ్వాలి - భారముతో ప్రార్ధించాలి
దేశమును కాపాడాలి - దేవుని కోపం ఆపాలి
దీనులకై రోదించాలి - దేవుని చిత్తం చేయాలి //2//
ప్రభువా ప్రభువా క్షమించుము మాపాపాన్ని
దేవా దేవా దయచూపుము మాదేశాన్ని
ప్రభువా ప్రభువా క్షమించుము మాపాపాన్ని
దేవా దేవా దహించకు మా దేశాన్ని //2//
2) ప్రార్ధించువారు లేవాలి - ఉజ్జీవమును తేవాలి
సంఘముకై విలపించాలి - సఖ్యతతో ప్రార్ధించాలి
ప్రార్ధనతో ఉద్యమించాలి - పోరాటములు ఆపాలి
ప్రార్ధనతోనే బ్రతకాలి - ప్రభువు ప్రీతిని పొందాలి


No comments:
Write CommentsSuggest your Song in the Comment.