Idhigo Deva Naa Jeevitham
ఇదిగో దేవా నా జీవితం
ఆపాదమస్తకం నీకంకితం (2)
శరణం నీ చరణం (4) ||ఇదిగో||
1. పలుమార్లు వైదొలగినాను
పరలోక దర్శనమునుండి
విలువైన నీ దివ్య పిలుపుకు
నే తగినట్లు జీవించనైతి (2)
అయినా నీ ప్రేమతో
నన్ను దరిచేర్చినావయా
అందుకే గైకొనుము దేవా
ఈ నా శేష జీవితం ||ఇదిగో||
2. నీ పాదముల చెంత చేరి
నీ చిత్తంబు నేనెరుగ నేర్పు
నీ హృదయ భారంబు నొసగి
ప్రార్థించి పనిచేయనిమ్ము (2)
ఆగిపోక సాగిపోవు
ప్రియసుతునిగా పనిచేయనిమ్ము
ప్రతి చోట నీ సాక్షిగా
ప్రభువా నన్నుండనిమ్ము ||ఇదిగో||
3. విస్తార పంట పొలము నుండి
కష్టించి పని చేయ నేర్పు
కన్నీటితో విత్తు మనసు
కలకాలం మరి నాకు నొసగు (2)
క్షేమ క్షామ కాలమైనా
నిన్ను ఘనపరచు బతుకునిమ్మయ్యా
నశియించే ఆత్మలన్
నీ దరి చేర్చు కృపనిమ్మయ్యా ||ఇదిగో||
also visit https://www.chaloosundayschoool.xyz/ for sundayschool song lyrics
HOSANNA MINISTRIES SONG 2024 BOOK
ఇదిగో దేవా నా జీవితం...
ReplyDeleteThis song is written by Dr Y.Babji. The song had already been printed in UESI-Andhra Pradesh (EU) song book VIDYARTHI GEETHAVALI 20 years back or more. Please acknowledge the writers of the song when you publish it in public.
—Prakash Gantela