ఆశలన్నీ
నే తెరిచే తలుపులు అన్నీ , తరచుగా మూసితివి
కోపించి పగనుంచినా నవ్వుతూ చూసితివి
నే తలిచే మార్గములన్నీ తరచుగా మూసితివి
కన్నీళ్లతో దుఃఖించినా కౌగిలిలొ దాచితివి
మూయుటకు కారణం ఈ మూర్ఖునికి తెలిసినదే
అడిగిన దానికంటే అధికమే పొందితినే
మూయుటకు కారణం ఇప్పుడే తెలిసినదే
అడిగిన దానికంటే ఎక్కువే పొందితినే
నా చిన్న చిన్న ఆశలన్నీ ఎరిగితివి కోరికలన్నీ తీర్చితివి
మూర్ఖునని నీవెరిగినా కౌగిలిలొ బంధించితివి
ఆశలన్నీ ఎరిగితివి కోరికలన్నీ తీర్చితివి
మూఢుడై నేనుండగా ఎత్తుకుని నడిపించితివి
1. తండ్రులెవరైననూ చేపనడిగితే పామునిచ్చునా
తండ్రీ నిన్ను దయ మాత్రమే వేడితిని
నీకు వేరుగా నేను ఏదియు కోరలేను
ఆశలే నా ఊసై తాకనీ జనుల మనసును
తప్పుగా అడగను నీ చిత్తమే కోరెదను
జీవముకు అర్ధము నీ వాక్యమే తెలిపెను
2. మది లోతులన్నీ నీవు మాత్రమే ఎరిగితివి
కలవరములన్నీ నీవే గ్రహియించితివి
ఏది ఏమైనగాని నీ సన్నిధి నేను చేరెదను
ఎవరి ఎగతాళి మించినా నీ చిత్తమే చేయ సాగెదను
ఎవ్వరికి తెలియని సంగతులు ఎరిగితివి
లోతైన గాయము నీ ప్రేమతో మాన్పితివి
|| నే తెరుచు ||
No comments:
Write CommentsSuggest your Song in the Comment.